విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) సినిమాపై పబ్లిసిటీ ప్రభావం.. పాజిటివ్‌ టాక్‌తో భారీగానే వసూళ్లు

Updated on May 13, 2022 09:07 PM IST
ఇటీవల బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన సినిమా పోస్టర్లు
ఇటీవల బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన సినిమా పోస్టర్లు

శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి మొదలవుతుంది. అందులోనూ వేసవి సెలవులు. ఇక, తగ్గేదేముంది అన్నట్టుగా ప్రేక్షకులు కూడా సినిమాలు చూడడానికి ఆసక్తి కనబరుస్తారు. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ వేసవిలో మాత్రమే సినిమాల సందడి కూడా మరోసారి స్టార్ట్‌ అయ్యింది. దీంతో ఎప్పుడెప్పుడు కొత్త సినిమా వస్తుందా అని అందరూ ఎదురుచూస్తూ.. వాటిని చూడడానికి ఎగబడుతున్నారు.

ఇక, కరోనా లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్లను ఢీకొట్టిన సినిమాల్లో బాలకృష్ణ అఖండ, పవర్‌‌స్టార్‌‌ పవన్‌ కల్యాణ్‌ భీమ్లానాయక్, ఎన్టీఆర్‌‌, రాం చరణ్‌ నటించిన ఆర్‌‌ఆర్‌‌ఆర్, యష్‌ పవర్‌‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌‌టైనర్‌‌ కేజీఎఫ్‌2 బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాయి. ఈ సినిమాల జోరు పూర్తిగా తగ్గకముందే మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్‌ నటించిన ఆచార్య సినిమా కూడా రిలీజై తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌‌టైన్‌ చేస్తున్నాయి.

ఈ క్రమంలో పోయిన శుక్రవారం మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు వాటిలో ఏ సినిమాలు సక్సెస్ అయ్యాయి.. ఏ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు అనే విషయాలపై ఒక లుక్‌ వేద్దాం..

విశ్వక్‌సేన్ (Vishwak Sen)

విశ్వక్‌సేన్‌ ‘అశోకవనంలో..’

యంగ్‌ హీరో విశ్వక్‌సేన్‌ హీరోగా నటించిన ‘అశోకవనంలో అర్జునకల్యాణం’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అప్పటివరకు మాస్‌ సినిమాలే చేస్తూ మాస్‌ ప్రేక్షకులకు దగ్గరవుతున్న విశ్వక్.. ఈ సినిమాతో క్లాస్ ప్రేక్షకులను కూడా టార్గెట్‌ చేశాడు. ఫుల్‌ లెంగ్త్ కామెడీ ఎంటర్‌‌టైనర్‌‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర కూడా మంచి వసూళ్లనే రాబడుతోంది. అయితే, ఈ సినిమా సక్సెస్‌లో పబ్లిసిటీ పాత్ర కూడా ఉందనే చెప్పాలి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విశ్వక్‌ మరో వ్యక్తితో కలిసి నడిరోడ్డుపై చేసిన ప్రాంక్ వీడియోపై చాలా మంది ఫైర్ అయ్యారు. సినిమా ప్రమోషన్స్‌ కోసం ఇంతకు దిగజారాలా అనే కామెంట్స్‌ చేశారు కూడా. అయితే అవేవీ సినిమా సక్సెస్‌పై ప్రభావం చూపలేదు. ఏదిఏమైనా విశ్వక్‌సేన్‌ ‘అశోకవనంలో అర్జునకల్యాణం’ సినిమా ఈ వారం వచ్చిన సినిమాల్లో మంచి టాక్‌ సొంతం చేసుకుంది.

జయమ్మ పంచాయితీ సినిమా పోస్టర్

యాంకర్ సుమ ‘జయమ్మ పంచాయితీ’

యాంకర్‌‌ సుమ.. ఈ పేరు చాలు వేరే ఏ పరిచయం అక్కర్లేదు ఆమెకు. బుల్లితెర యాంకర్‌‌గానే కాకుండా, వెండితెరపైన కూడా సందడి చేయాలనే టార్గెట్‌తో తీసిన సినిమా ‘జయమ్మ పంచాయితీ’. పల్లెటూరి కథా, కథనం నేపథ్యంలో తీసిన సినిమా. బుల్లితెర, వెండితెరపై తనకున్న అనుభవం, సీనియారిటీతో పబ్లిసిటీపై ఫుల్‌గా ఫోకస్‌ పెట్టి సినిమాను జనాల్లోకి బాగానే తీసుకెళ్లింది. తనకున్న మంచిపేరుతో పెద్దపెద్ద స్టార్లతో సినిమా ట్రైలర్‌‌, పాటలను కూడా రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచడంలో సక్సెస్ అయ్యింది కూడా. అయితే జయమ్మ పంచాయితీ సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

శ్రీ విష్ణు ‘భళా తందనాన’ రివ్యూ పోస్టర్

‘భళా తందనాన’ పరిస్థితి..

శ్రీ విష్ణు, కేథరిన్ ట్రెసా హీరోహీరోయిన్లుగా నటించిన ‘భళా తందనాన’ సినిమా కూడా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించలేదు. కథ, కథనం ఉంటే పబ్లిసిటీ లేకున్నా సినీ ప్రేమికులు చూస్తారని అనుకున్నారో ఏమో కానీ.. చిత్ర యూనిట్‌ మాత్రం సినిమా ప్రమోషన్స్‌పై పెద్దగా ఫోకస్ చేయలేదనే చెప్పాలి. ట్రైలర్‌‌ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కార్యక్రమాలను నిర్వహించినా ఆ తర్వాత ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్‌ వెనుకబడిందనే చెప్పుకోవాలి. ఏది ఏమైనా ‘భళా తందనాన’ సినిమా కూడా బాక్సాఫీస్‌ దగ్గర సరైన వసూళ్లు రాబట్టలేదనే తెలుస్తోంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!