Godse: యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా వ‌స్తున్న గాడ్సే విడుద‌ల ఎప్పుడంటే?

Updated on May 22, 2022 03:30 PM IST
Godse: చాలా రోజుల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు గాడ్సే సినిమా రిలీజ్ ఎప్పుడో రివీల్ చేశారు.
Godse: చాలా రోజుల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు గాడ్సే సినిమా రిలీజ్ ఎప్పుడో రివీల్ చేశారు.

బ్లఫ్ మాస్టర్, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య, 47 డేస్, గువ్వ గోరింక, పిట్ట కథలు.. లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు స‌త్య‌దేవ్.  ఇప్పుడు ఈయన హీరోగా నటిస్తున్న 'గాడ్సే' సినిమా త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా వ‌స్తున్న 'గాడ్సే'కు గోపి గ‌ణేశ్ ప‌ట్టాభి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కేర‌ళ కుట్టి ఐశ్వ‌ర్యలక్ష్మి ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. చాలా రోజులు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం.. ఎట్టకేలకు డిస్ట్రిబ్యూటర్ల నుండి గ్రీన్ సిగ్నల్ పొందింది. తొలుత గాడ్సే మూవీని మే 20న విడుద‌ల చేయాల‌ని భావించారు. కానీ కొన్ని కారణాలతో, దీని విడుదల తేదిని మార్చారు. 

2022 జూన్ 17 న సినిమాను రిలీజ్ చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. రిలీజ్ ఎప్పుడో తెలుపుతూ ఓ పోస్ట‌ర్‌ను సైతం విడుద‌ల చేసింది. ఈ సినిమాలో రాజ‌కీయ స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేసేందుకు గాడ్సేగా మారుతాడు ఓ యువకుడు. అందుకోసం ఓ మిష‌న్ కూడా స్థాపిస్తాడు. గ‌న్ పట్టుకొని, రాజకీయ స‌మ‌స్య‌ల‌ ప‌రిష్కారాల కోసం ప్రయత్నించే ఓ యువకుడి కథే ఈ 'గాడ్సే' 

విడుద‌ల లేటైనా.. వ‌రుస ప్ర‌మోష‌న్లుతో 'గాడ్సే' (Godse) స్పీడు పెంచ‌నున్నారు నిర్మాతలు. ఈ చిత్రంలో చైత‌న్య కృష్ణ‌, పృథ్విరాజ్‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, నాగ‌బాబు కొణిదెల, బ్ర‌హ్మాజీ, నోయెల్ సీన్‌, ప్రియ‌ద‌ర్శి, నాజ‌ర్‌, సిజ్జు ముఖ్య పాత్రలలో న‌టిస్తున్నారు. ఇదే చిత్రానికి సునీల్ కాశ్య‌ప్, సాండీ అద్దంకి మ్యూజిక్ డైరెక్ట‌ర్లుగా సంగీతాన్ని అందించారు. సీకే స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ గాడ్సే ఈ చిత్రాన్ని నిర్మించారు. 

తెలుగులో స‌రికొత్త  క‌థ‌ల‌ను ఎంచుకోవడంతో పాటు,  కీల‌క రోల్స్‌లో కూడా న‌టిస్తున్నారు స‌త్య‌దేవ్. ఈయన 'ఆచార్య' సినిమాలో రామ్ చ‌ర‌ణ్ తండ్రిగా న‌టించి మెప్పించారు. 'స‌రిలేరు నీకెవ్వ‌రు' సినిమాలో కూడా మ‌హేష్ బాబుతో కలిసి న‌టించారు. 47 రోజులు, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో ఓటీటీలో వినోదం పంచారు. తిమ్మరుసు, గుర్తుందా శీతాకాలం, స్కైలాబ్ సినిమాల‌తో విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు. 

ప్రస్తుతం స‌త్య‌దేవ్(Satyadev) తెలుగుతో పాటు హిందీ సినిమాల్లోనూ న‌టిస్తున్నారు. అక్ష‌య్ కుమార్‌తో క‌లిసి 'రామ్ సేతు' సినిమా చేస్తున్నారు. చిరంజీవి, న‌య‌న‌తార హీరో,హీరోయిన్లుగా న‌టిస్తున్న 'గాడ్ ఫాద‌ర్' సినిమాలో కూడా స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. 'గాడ్సే'లో లీడ్ రోల్ చేస్తున్న స‌త్య‌దేవ్.. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని, ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!