టెండ్ర్ సెట్ చేస్తున్న‌ స‌ర్కారు వారి పాట ట్రైల‌ర్(Sarkaru Vaari Paata)

Updated on May 03, 2022 02:43 PM IST
Sarkaru Vaari Paata: మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట సినిమా ట్రైల‌ర్ ట్రెండ్ సెట్ చేస్తుంది. మ‌హేష్ బాబు సినిమా ట్రైల‌ర్ విడుద‌లైన కొన్ని గంట‌ల్లో మిలియ‌న్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమా ట్రైల‌ర్ స‌రికొత్త రికార్డును బ్రేక్  చేయ‌నుందా...

స‌ర్కారు వారి పాట సినిమా ట్రైల‌ర్ యూట్యూబలో మొద‌టి ట్రెండింగ్‌గా పరుగులు పెడుతుంది. మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమా మే 12న రిలీజ్ కానుంది. ప‌రశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ట్రైల‌ర్ మిలియ‌న్ల వ్యూస్ సాదించింది. ఒక్క రోజులోనే 26 మిలియ‌న్ల వ్యూస్ సొంతం చేసుకుంది. 

మహేష్ బాబు సినిమాకు వ్యూస్‌తో పాటు లైక్స్ కూడా భారీగా ప‌డుతున్నాయి.  యూట్యూబ్‌లో స‌ర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమా ట్రైల‌ర్‌కు 1.1 మిలియ‌న్ల లైకులు వ‌చ్చాయి. ఈ సినిమా ట్రైలర్​ యూట్యూబ్​లో నెంబర్​ వన్​ స్థానంలో ట్రెండ్​ అవుతోంది.  మహేశ్ బాబుకు సంబంధించి 105 షార్ట్స్ ఉన్న‌ ట్రైలర్ విడుద‌ల చేశారు. యాక్ష‌న్, రొమాన్స్ స‌న్నివేశాల‌తో స‌ర్కారు వారి పాట సినిమా ట్రైల‌ర్ అభిమానుల‌ను మిస్మ‌రైజ్ చేస్తుంది. 

స‌ర్కారు వారి పాట సినిమాను మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్‌ సంగీతం అందిస్తున్నారు. క‌మాన్. కమాన్. క‌ళావ‌తి సాంగ్ కూడా ఎంత పాపుల‌ర్ అయిందో అంద‌రీకీ తెలుసు. ట్రైల‌ర్ ఇంత హిట్ తెస్తే.. సినిమా ఇంకా ఏ రేంజ్‌లోఆడుతుందోన‌ని ప్రేక్ష‌కులు అంటున్నారు. మ‌హేష్ బాబు కెరీర్‌లో స‌ర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!