Sarkaru Vaari Paata: ఈ సిన్మా ఏడు రోజుల క‌లెక్ష‌న్ చూస్తే.. దిమ్మ తిరిగి బొమ్మే!

Updated on May 22, 2022 04:28 PM IST
sarkaru vaari paata:  మ‌హేష్ బాబుకు బిగ్ బ్లాక్ బాస్ట‌ర్ హిట్ ఇచ్చిన సినిమా స‌ర్కారు వారి పాట‌. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రిలీజ్ అయిన ఈ సినిమా మొద‌టి వారం వ‌సూళ్లులో దూసుకెళ్లింది.
sarkaru vaari paata: మ‌హేష్ బాబుకు బిగ్ బ్లాక్ బాస్ట‌ర్ హిట్ ఇచ్చిన సినిమా స‌ర్కారు వారి పాట‌. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రిలీజ్ అయిన ఈ సినిమా మొద‌టి వారం వ‌సూళ్లులో దూసుకెళ్లింది.

మ‌హేష్ బాబుకు బిగ్ బ్లాక్ బాస్ట‌ర్ హిట్ ఇచ్చిన సినిమా 'స‌ర్కారు వారి పాట‌'. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రిలీజ్ అయిన ఈ సినిమా మొద‌టి వారం వ‌సూళ్లలో దూసుకెళ్లింది. ఇదే క్రమంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీసును షేక్ చేస్తోంది. దీంతో, థియేట‌ర్ల‌న్నీ హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో నిండిపోతున్నాయి. 

ప‌రుశురామ్ చెప్పిన‌ట్టే 'స‌ర్కారు వారి పాట' పెద్ద హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో మ‌హేష్ బాబు లుక్స్ మొత్తం మార్చేశారు ద‌ర్శ‌కుడు. కీర్తి సురేష్, మ‌హేష్‌ల కెమిస్ట్రీ 'క‌ళావ‌తి' సాంగ్ వల్ల పీక్స్‌కు వెళ్లింది. తొలుత నెగిటివ్ టాక్ వచ్చినా, ఆ తర్వాత హై రేంజ్ హిట్‌గా నిలిచింది ఈ చిత్రం. మైత్రీ మూవీ మేక‌ర్స్ , 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా  నిర్మించిన ఈ సినిమా కాసుల వ‌ర్షం కురిపించింది. 

sarkaru vaari paata: స‌ర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయిన మొద‌టి వారం క‌లెక్ష‌న్ రూ.175 కోట్లు దాటింది

ప్రస్తుతం వ‌రుస విజ‌యాల‌తో మ‌హేష్ బాబు దూసుకెళుతున్నారు. 'స‌ర్కారు వారి పాట' సినిమా రిలీజ్ అయ్యాక.. ఈ సినిమా మొద‌టి వారం క‌లెక్ష‌న్ రూ.175 కోట్లు దాటింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 107. 26 కోట్ల రూపాయల షేర్  కూడా వ‌చ్చింది. బ్యాంక్ రుణాల నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ సినిమాలో మంచి సోష‌ల్ మెసేజ్ ఉంది. సుప్రీం కోర్టులో కూడా 'స‌ర్కారు వారి పాట' సినిమా ప్ర‌స్తావ‌న రావాలని కొందరు అంటున్నారు అంటే.. ఏ రేంజ్‌లో సినిమాలో హిట్ అయ్యిందో అర్థమవుతుంది.  

ఇక మ‌హేష్ బాబు సైన్ చేయబోయే తదుపరి సినిమాల‌పై సినీ వ‌ర్గాల్లో, ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి పెరిగింది.  త్రివిక్రమ్ డైరెక్ష‌న్‌లో, మ‌హేష్ సినిమా షూటింగ్ జూన్ నెల‌లో ప్రారంభం కానుంది.  త్రివిక్ర‌మ్ సినిమాలో పూాజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై  ఈ సినిమా రూపొందనుంది. అలాగే ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళితో కూడా ఓ సినిమా చేయ‌నున్నారు ప్రిన్స్. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!