Sarkaru Vaari Paata : వసూళ్ల సునామీ సృష్టిస్తున్న‌ సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌బాబు ‘స‌ర్కారు వారి పాట’.. మొదటిరోజే అన్ని కలెక్షన్లా?

Updated on May 13, 2022 09:18 PM IST
Sarkaru Vaari Paata : స‌ర్కారు వారి పాట ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌లెక్ష‌న్ల మోత మోగిస్తోంది. ప‌రుశురామ్ డైరెక్ష‌న్‌లో వచ్చిన తొలిరోజే వ‌ర‌ల్డ్ వైడ్ రూ. 75 కోట్లు కొల్ల‌గొట్టింది.
Sarkaru Vaari Paata : స‌ర్కారు వారి పాట ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌లెక్ష‌న్ల మోత మోగిస్తోంది. ప‌రుశురామ్ డైరెక్ష‌న్‌లో వచ్చిన తొలిరోజే వ‌ర‌ల్డ్ వైడ్ రూ. 75 కోట్లు కొల్ల‌గొట్టింది.

Sarkaru Vaari Paata : స‌ర్కారు వారి పాట ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌లెక్ష‌న్ల మోత మోగిస్తుంది. ప‌రుశురామ్ డైరెక్ష‌న్‌ చేసిన సినిమా తొలిరోజే వ‌ర‌ల్డ్ వైడ్ రూ.75 కోట్లు కొల్ల‌గొట్టింది. బ్లాక్‌బస్టర్‌‌ హిట్‌ టాక్‌తో ఇండియాతో పాటు ఓవ‌ర్సీస్‌లో కూడా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. 

మ‌హేష్‌బాబు, కీర్తి సురేష్ జంట‌గా ‘స‌ర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata)  సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప‌రుశురామ్ పెట్ల ద‌ర్శ‌క‌త్వం ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది. ‘స‌ర్కారు వారి పాట’ సినిమా మొద‌టి రోజు భారీ బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లు వ‌సూలు చేసింది. 

స‌ర్కారు వారి పాట‌ (Sarkaru Vaari Paata) ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది. మహేష్ బాబు కెరీర్​లోనే హయ్యెస్ట్‌ కలెక్షన్లు కురిపించింది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్‌, జీఎంబీ ఎంట‌ర్‌ట్రైన్‌మెంట్ క‌లిసి ఈ సినిమా నిర్మించాయి. థ‌మ‌న్ అందించిన సంగీతం స‌న్సేష‌నల్ అయితే.. అనంత్‌ శ్రీరామ్ లిరిక్స్ థియేట‌ర్ల‌ను షేక్ చేస్తున్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వ‌సూళ్లే రాబ‌ట్టింది మ‌హేష్ న‌టించిన ‘స‌ర్కారు వారి పాట’ సినిమా. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో మొత్తం రూ.36.69 కోట్లు రాబ‌ట్టింది. 

సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) బ్లాక్‌బస్టర్ హిట్‌ కేక్‌

‘సర్కారు వారి పాట’ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ 

  • నైజాం - రూ.12.24 కోట్లు
  •  సీడెడ్ - రూ.4.7 కోట్లు
  •  ఈస్ట్ - రూ.3.25 కోట్లు
  •  వెస్ట్ - రూ. 2.74 కోట్లు
  •  ఉత్త‌రాంధ్ర - రూ.3.73 కోట్లు
  •  గుంటూరు- రూ.5.83 కోట్లు
  •  కృష్ణా - రూ. 2.58 కోట్లు 
  •  నెల్లూరు - రూ.1.56 కోట్లు
  • మొత్తం రూ.36.69 కోట్లు 

Sarkaru Vaari Paata

‘స‌ర్కారు వారి పాట’ సినిమా రిలీజైన మొద‌టిరోజే ప్ర‌పంచవ్యాప్తంగా రూ.75 కోట్లు రాబ‌ట్టింది. మొదటి రోజు కలెక్షన్లే ఇంత భారీగా ఉంటే రాబోయే రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో.. ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!