స‌ర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) : పాన్ ఇండియా సినిమాగా.. ఈ చిత్రాన్ని ఎందుకు తీయలేదు?

Updated on May 11, 2022 01:53 PM IST
Sarkaru Vaari Paata: సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. హీరో మ‌హేష్ సినిమా స‌ర్కారు వారి పాట సినిమా తెలుగులోనే రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా సినిమాగా ఎందుకు రిలీజ్ చేయ‌డం లేదో ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ క్లారిటీ ఇచ్చారు. 
Sarkaru Vaari Paata: సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. హీరో మ‌హేష్ సినిమా స‌ర్కారు వారి పాట సినిమా తెలుగులోనే రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా సినిమాగా ఎందుకు రిలీజ్ చేయ‌డం లేదో ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ క్లారిటీ ఇచ్చారు. 

పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్..  ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఈ మధ్యకాలంలో దక్షిణాది నుండి కూడా పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ, హీరో మ‌హేష్ బాబు సినిమా "స‌ర్కారు వారి పాట" Sarkaru Vaari Paata) సినిమా  మాత్రం తెలుగులోనే విడుదల అవుతోంది. పాన్ ఇండియా సినిమాగా దీనిని ఎందుకు రిలీజ్ చేయ‌డం లేదో ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ క్లారిటీ ఇచ్చారు. 

ప్ర‌భాస్‌, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్, య‌శ్... వీళ్ల‌లాగా మ‌హేష్ కూడా పాన్ ఇండియా హీరో అవ్వాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే "స‌ర్కారు వారి పాట" Sarkaru Vaari Paata) చిత్రాన్ని మాత్రం మాత్రం పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కించ‌లేదు. దీంతో మ‌హేష్ అభిమానులు కాస్త ఫీల్ అయ్యారు. ప్రస్తుతం తెలుగులోనే స‌ర్కారు వారి పాట రిలీజ్ అవుతుంద‌ని.. ఇంకా వేరే భాష‌ల్లో కూడా రిలీజ్ చేస్తే బాగుండేద‌ని అంటున్నారు. 

ఈ క్రమంలో "స‌ర్కారు వారి పాట" (Sarkaru Vaari Paata) చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా ఎందుకు రిలీజ్ చేయ‌డం లేదో ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ తెలిపారు. తెలుగు ఆడియ‌న్స్ కోస‌మే మ‌హేష్ బాబు (Mahesh Babu) సినిమా క‌థ‌ను తాము రెడీ చేసుకున్నామ‌న్నారు. ఈ సినిమాలోని కథ యూనివర్సల్ కాన్సెప్ట్ అయినప్పటికీ కూడా.. చిత్రంలోని ప్రధామైన సీన్స్ లోకల్‌గా కనెక్ట్ అయితేనే బాగుంటుంద‌న్నారు. తమిళనాడు లేదా ఇతర ప్రాంతాల నుంచి డిస్ట్రిబ్యూటర్ల డబ్డ్ వెర్షన్ కోరినా.. కేవలం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తోనే రిలీజ్ చేయాలన్నది తమ ఆలోచన అని నిర్మాతలు తెలిపారు. 

"స‌ర్కారు వారి పాట" (Sarkaru Vaari Paata) సినిమాకు పాటలను అందించిన థ‌మ‌న్ తన సంగీతంతో అదర‌గొట్టారు. అలాగే ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు స‌ముద్ర ఖ‌ని ఈ సినిమాలో విల‌న్‌గా న‌టిస్తున్నారు. నదియా, తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో నటించారు. వెన్నెల కిషోర్ కమెడియన్ రోల్ చేస్తున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!