Sarkaru Vaari Paata : స‌ర్కారు వారి పాట సెన్సార్ రిపోర్ట్‌తో పెరుగుతున్న అంచ‌నాలు

Updated on May 06, 2022 03:17 PM IST
Sarkaru Vaari Paata : స‌ర్కారు వారి పాట సినిమాతో  హీరో మ‌హేష్ బాబు మాస్ హిట్ కొడ‌తార‌ని టాక్. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా ట్రైల‌ర్ మిలియ‌న్ వ్యూస్‌తో దూసుకుపోతుంది.
Sarkaru Vaari Paata : స‌ర్కారు వారి పాట సినిమాతో  హీరో మ‌హేష్ బాబు మాస్ హిట్ కొడ‌తార‌ని టాక్. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా ట్రైల‌ర్ మిలియ‌న్ వ్యూస్‌తో దూసుకుపోతుంది.

Sarkaru Vaari Paata : స‌ర్కారు వారి పాట సినిమాతో  హీరో మ‌హేష్ బాబు మాస్ హిట్ కొడ‌తార‌ని టాక్. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా ట్రైల‌ర్ మిలియ‌న్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. ట్రైల‌ర్ చూసిన ప్రేక్ష‌కులు... స‌ర్కారు వారి పాట సినిమా సంచ‌నాల‌ను సృష్టిస్తుంద‌ని అంటున్నారు. 

సర్కారు వారి పాట సెన్సార్ రిపోర్ట్ బ‌య‌ట‌కు రావ‌డంతో అంచ‌నాలు బాగా పెరిగాయి. ప‌క్కాగా బంప‌ర్ హిట్ కొడుతుంద‌నే టాక్ న‌డుస్తుంది. మ‌రో వారంలో స‌ర్కారు వారి పాట సినిమా విడుద‌ల కానుంది. వ‌రుస పాట‌ల రిలీజుల‌తో ఈ సినిమా ఇప్ప‌టికే యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. థ‌మ‌న్ సంగీతం ఆడియ‌న్స్‌కు తెగ న‌చ్చేసింది. 

సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) చిత్ర యూనిట్ సెన్సార్ పూర్తి చేసుకుంది. యాక్ష‌న్ సీన్స్ అదిరిపోయే రేంజ్‌లో తీశార‌ట‌. బ్యాంక్ మోసాల‌పై  సాగే క‌థ‌నంలో స‌ర్కారు వారి పాట సినిమాను తెర‌కెక్కించారు.  గీత గోవిందం మూవీ డైరెక్ట‌ర్ ప‌రుశురామ్ స‌ర్కారు వారి పాట సినిమాలో కొత్త ఎలిమెంట్స్ జోడించారు.  సముద్ర ఖని, సుబ్బరాజ్, అజయ్, తనికెళ్ళ భరణి, నదియా ఈ సినిమాలో న‌టించారు. 

మ‌రో అప్ డేట్ ఏంటంటే స‌ర్కారు వారి పాట ప్ర‌మోష‌న్స్‌ల్లో మ‌రో ప్టాన్ అమ‌లు చేయ‌నున్నారు. రెండు భారీ ఈవెంట్ల‌తో ప్రేక్ష‌కులల్లో ఈ సినిమాపై ఆస‌క్తి  పెంచేలా చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో చెబుతున్న క‌బుర్లు వైర‌ల్‌గా మారాయి. మ‌హేష్‌ను చెంప‌పై కొట్టార‌ని కీర్తి సురేష్ చెప్పారు. ప్రిన్స్‌తో అదిరేటి స్టెప్పులు వేయించాన‌ని కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్ అన్నారు. ఇక ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ అయితే.. సినిమా రిలీజ్ లేట్ చేశాన‌ని.. అందుకు మ‌హేష్ బాబుకు చిరు కోపం వ‌చ్చిందంటూ స‌ర‌దాగా చెప్పారు. ఇలాంటి ముచ్చ‌ట్లు ఆడియ‌న్స్‌కు ఇంట్ర‌స్ట్‌గా మారాయి.

స‌ర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) ప్ర‌పంచ వ్యాప్తంగా మే 12 రిలీజ్ కానుంది. మాస్ సాంగ్ కొన్ని గంట‌ల్లో విడుద‌ల కానుంది. మా.. మా.. మ‌హేషా అంటూ సాగే పాట ఎన్ని వ్యూస్ సాధిస్తుందో చూడాలి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!