Sarkaru Vaari Paata: స‌ర్కారు వారి పాట హౌస్ ఫుల్... మీకు అర్థ‌మ‌వుతోందా!

Updated on May 11, 2022 10:33 PM IST
Sarkaru Vaari Paata:  మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన సినిమా రిలీజ్‌కు ముందే హిట్ టాక్ సాధించింది. ప్రిన్స్ సినిమా కోసం అడ్వాన్స్ బుకింగ్‌లు కోట్లను కొల్ల‌గొడుతున్నాయి. ఏ హాలు చూసినా ముంద‌స్తు బుక్సింగ్స్‌తో థియేట‌ర్లు హౌస్ ఫుల్ అయిపోయాయి. 

పరశురామ్‌ దర్శకత్వంలో వ‌స్తున్న స‌ర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)  సినిమా మే 12న రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ మైండ్ బ్లాక్ చేసింది. ఇక పాట‌లు, మ‌హేష్ డాన్సులతో స‌ర్కారు వారి పాట థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది

హైద‌రాబాద్‌లోనూ స‌ర్కారు వారి పాట అడ్వాన్స్ బుకింగ్స్‌ జోరు అందుకున్నాయి. భాగ్య‌న‌గ‌రంలో ప్రీ రిలీజ్ సేల్స్ 2.5 కోట్ల మార్క్ ని టచ్ చేసింది. ఈ బుకింగ్స్ ఇంకా భారీగా పెరుగుతాయ‌ని అంచ‌నా.ఇండియాలో స‌ర్కారు వారి పాట సినిమా అడ్వాన్స్ సేల్స్ ఇప్పటి వరకూ రూ. 6 కోట్లు దాటింది. 

తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవో స‌ర్కారు వారి పాట‌కు గుడ్ న్యూస్ అయింది.టికెట్ ధరలను పెంచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ సినిమా టికెట్ ధ‌ర 30 నుంచి 50 రూపాయల వరకు పెంచ‌వ‌చ్చ‌ని జీవోలో పేర్కొంది. 7 రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌లు, మల్టీప్లెక్స్‌లలో ఈ ధరలు ఉంటాయి. 7 రోజులు 5 షోలతో స‌ర్కారు వారి పాట అద‌ర‌గొట్ట‌నుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం  సినిమా టికెట్ల ధర పెంపుకు అనుమతి ఇచ్చింది. 10 రోజుల పాటు సాధారణ టికెట్ల రేటుపై రూ.45 అదనంగా వసూళ్లు చేసుకోవ‌చ్చ‌ని జీవో జారీ చేసింది. టీఎస్, ఏపీ ప్ర‌భుత్వాల‌కు స‌ర్కారు వారి పాట టీం కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.

స‌ర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)  సినిమాలో మ‌హేష్ కొత్త లుక్‌లో క‌నిపించ‌నున్నారు. పోకిరి మించి మాస్ మ‌సాలా ఉంటుంద‌ని చిత్ర యూనిట్ తెలిపింది.  నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం ఇప్ప‌టికే యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. అనంత శ్రీరామ్ లిరిక్స్ అద‌ర‌గొడుతున్నాయి. స‌ర్కారు వారి పాట పాజిటీవ్ టాక్‌తో అడ్వాన్స్ బుకింగ్స్ విష‌యంలో బ్రేక్‌లేకుండా దూసుకుపోతుంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!