Macherla Niyojakavargam: 'మాచర్ల నియోజ‌క‌వ‌ర్గం'లో ప‌వ‌ర్ ఫుల్ విల‌న్‌గా స‌ముద్ర‌ఖ‌ని (Samuthirakani)

Updated on Jul 15, 2022 03:10 PM IST
Macherla Niyojakavargam: 'మాచ‌ర్ల నియోజ‌క‌ర్గం'లో స‌ముద్ర‌ఖ‌ని రాజ‌కీయ నేత‌ రాజ‌ప్ప పాత్ర‌లో న‌టిస్తున్నారు.
Macherla Niyojakavargam: 'మాచ‌ర్ల నియోజ‌క‌ర్గం'లో స‌ముద్ర‌ఖ‌ని రాజ‌కీయ నేత‌ రాజ‌ప్ప పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Macherla Niyojakavargam: టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin) న‌టిస్తున్న మాస్ యాక్ష‌న్ సినిమా 'మాచర్ల నియోజకవర్గం'. ఈ సినిమా నుంచి విల‌న్ లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం'లో స‌ముద్ర‌ఖ‌ని రాజ‌ప్ప పాత్ర‌లో న‌టిస్తున్నారు.ఈ చిత్రంలో హీరో నితిన్‌కు జోడిగా కృతి శెట్టి న‌టిస్తున్నారు.

ఈ సినిమాకి కొత్త డైరెక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆదిత్య మూవీస్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' ఆగ‌స్టు 12న విడుద‌ల కానుంది. 

విల‌న్ లుక్ విడుద‌ల‌
న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని ప్రస్తుతం టాలీవుడ్‌లో విల‌న్ పాత్ర‌ల్లో దూసుకుపోతున్నారు. ప్ర‌తి సినిమాలో తన పాత్రకు సంబంధించి కొత్త‌ద‌నం ఉండేలా ఆయన చూసుకుంటూ ఉంటారు. తనవైన డైలాగులు, మ్యాన‌రిజంతో ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను కూడా క్రియేట్ చేసుకున్నారు.

మ‌హేష్ బాబు న‌టించిన 'స‌ర్కారు వారి పాట‌'లో విల‌న్‌గా స‌ముద్ర‌ఖ‌ని న‌ట‌న‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. ప్ర‌స్తుతం స‌ముద్ర‌ఖ‌ని న‌టించిన 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' నుంచి మేక‌ర్స్ విల‌న్ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. 

స‌ముద్ర‌ఖ‌ని పాత్ర ప్ర‌త్యేకం
Macherla Niyojakavargam: 'మాచ‌ర్ల నియోజ‌క‌వర్గం'లో స‌ముద్ర‌ఖ‌ని రాజ‌కీయ నేత‌ రాజ‌ప్ప పాత్ర‌లో న‌టిస్తున్నారు. మేక‌ర్స్ విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో ఆయన పలికిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన డైలాగ్ ఉంది. "రాజ‌ప్ప‌కు ఎన్నిక‌లు ఉండ‌వు.. తను ఏకగ్రీవ ఎమ్మెల్యే" అనే మాట విలన్ పాత్రలోని నిరంకుశత్వాన్ని మనకు తెలియజేస్తుంది.

ఈ డైలాగ్‌తోనే రాజ‌ప్ప పాత్ర ఎంత ప‌వ‌ర్ ఫుల్‌గా ఉండ‌నుందో కూడా తెలుస్తుంది. ఇక వెండితెర‌పై రాజ‌ప్ప విల‌నిజంతో పాటు, నితిన్ హీరోయిజం చూసేందుకు కూడా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్నారు. 

క‌మ‌ర్షియ‌ల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ (Nithiin) కొత్త క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. మాస్ ఎంటర్ టైనర్‌గా 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' తెర‌కెక్కింది. హీరోయిన్లు కృతి శెట్టి, కేథరిన్ ట్రెసా 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన ‘రా రా రెడ్డి’ స్పెషల్ సాంగ్ కు ఆడియెన్స్ నుంచి మాసీవ్ రెస్పాన్స్ దక్కింది. 

Read More : Jayam Movie: నితిన్ తొలి సినిమాకి 20 ఏళ్లు ! 'జయం' అప్పట్లో ఓ సంచలనం !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!