Sammathame Movie: హిట్ టాక్ సొంతం చేసుకున్న 'సమ్మతమే' మూవీ.. సక్సెస్ సెలబ్రేషన్స్ లో కిరణ్ అబ్బవరం!

Published on Jun 25, 2022 07:26 PM IST

సినిమా ఇండస్ట్రీలో కి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా నిలదొక్కుకున్న నటుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఆయన  కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'సమ్మతమే'. చాందిని చౌదరి కథానాయికగా నటిస్తోంది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ నిర్మించారు. 

ప్రపంచ వ్యాప్తంగా 'సమ్మతమే' మూవీ(Sammathame Movie) జూన్ 24న విడుదలయింది. విడుదలయిన అన్ని థియేటర్లలో ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శతమవుతోంది. దీంతో కిరణ్ అబ్బవరం అభిమానులు, ప్రేక్షకుల మధ్య సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. 

ఇటీవల ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ (Sammathame Pre Release Event) గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసారు. 

ఇక, ఈ సినిమా హీరోహీరోయిన్లు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), చాందిని చౌదరి చిత్ర బృందంతో పాటు మెగా నిర్మాత అల్లు అరవింద్, నిర్మాత బన్నీవాసు, దర్శకుడు సందీప్ రాజ్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ‘సమ్మతమే’  బిగ్ టికెట్ లాంచ్ చేశారు నిర్మాత అల్లు అరవింద్.

Read More: Kiran Abbavaram: 'సమ్మతమే' మూవీ ప్రమోషన్లను వినూత్నంగా నిర్వహిస్తున్న 'కిరణ్ అబ్బవరం'