సోష‌ల్ మీడియాకు దూరంగా 'స‌మంత‌' (Samantha).. ఏం జ‌రిగి ఉంటుందో ?

Updated on Jul 17, 2022 10:04 PM IST
స‌మంత (Samantha) సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టి రెండు వారాలు దాటుతుంది.
స‌మంత (Samantha) సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టి రెండు వారాలు దాటుతుంది.

హీరోయిన్ స‌మంత (Samantha) సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. త‌న లేటెస్ట్ సినిమా వివ‌రాల‌తో పాటు వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా స‌మంత ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అంతే కాకుండా, ప‌లు బ్రాండ్ల ప్ర‌మోష‌న్ల వివ‌రాల‌ను సైతం తెలుపుతుంటారు. అయితే ఈ మ‌ధ్య స‌మంత సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఆ విష‌యం ప్ర‌స్తుతం సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

స‌మంత (Samantha) సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టి రెండు వారాలు దాటుతుంది.

స‌మంత సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టి రెండు వారాలు దాటుతుంది. ఆమె అభిమానులు కొత్త  పోస్టుల కోసం సామాజిక మాధ్యమాలలో పడికాపులు కాస్తున్నారు. స‌మంత నిరంతరం సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతూ, త‌న అభిమానులతో టచ్‌లో ఉంటూ ఉంటారు. కానీ రెండు వారాల నుంచి ఆమె ఏ అప్‌డేట్ పోస్ట్ చేయ‌క‌పోవ‌డంతో అభిమానులు తీవ్ర నిరాశ‌లో ఉన్నారు. 

స‌మంత (Samantha) సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టి రెండు వారాలు దాటుతుంది.

సమంత (Samantha) చివరిగా జూలై 5 న ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. జూన్ 30న ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ తర్వాత సామ్ సోషల్‌ మీడియాకు పూర్తి దూరమైపోయారు. ఆ మధ్య సామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాక్‌ అయిందని పలు వార్తలు వచ్చాయి.

స‌మంత (Samantha) సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టి రెండు వారాలు దాటుతుంది.

స‌మంత (Samantha) మాజీ భ‌ర్త నాగ‌చైత‌న్య‌, శోభితా దూళిపాళల స‌హ‌జీవ‌నంపై వ‌చ్చిన వార్త‌ల‌పై స‌మంత ఇటీవలే కామెంట్ చేశారు. 'అమ్మాయిల‌పై ఏదైనా వార్త వ‌స్తే అది నిజ‌మైపోతుంది. కానీ అబ్బాయిల‌పై జ‌రిగే ప్ర‌చారాల‌కు అమ్మాయిలే కార‌ణ‌మంటారు' అని సామ్ పోస్ట్ చేశారు. 'అబ్బాయిలు కాస్త ఎద‌గండి. ముందుకు సాగండి. అబ్బాయిలు.. మీరు చేసే ప‌ని మీద‌, మీ కుటుంబంపైన దృష్టి పెట్టండి' అంటూ సమంత ఇన్ డైరెక్ట్‌గా పంచులు విసిరారు.

స‌మంత (Samantha) సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టి రెండు వారాలు దాటుతుంది.

స‌మంత పోస్టుల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ సినిమాలతోనూ స‌మంత బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో స‌మంత ఎలాంటి పోస్టుల‌తో అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేయ‌నుందో చూడాలి.
 
Read More: Samantha Ruth Prabhu: పెళ్లి త‌ర్వాత జీవితం వైలెంట్‌గా ఉంటుంది -  నాగ‌చైత‌న్య‌పై స‌మంత సెటైర్లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!