మాస్ సాంగ్‌ల‌కు 'ఉ.. అంటున్న' స‌మంత‌ (Samantha)... 'య‌శోద‌'లో స్పెష‌ల్ సాంగ్ కోసం భారీ సెట్లు

Updated on Jul 17, 2022 10:38 PM IST
ఫ్యామిలీ మ్యాన్ 2 షూటింగ్ కంటే ముందు స‌మంత (Samantha) య‌శోద చిత్రానికి ఓకే చెప్పారు.
ఫ్యామిలీ మ్యాన్ 2 షూటింగ్ కంటే ముందు స‌మంత (Samantha) య‌శోద చిత్రానికి ఓకే చెప్పారు.

సౌత్ సినిమా రంగంలోనే హీరోయిన్‌ స‌మంత (Samantha) న‌ట‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. టాప్ హీరోల సినిమాల్లో ఆమె న‌టించి మెప్పించారు. అంతే కాకుండా స్పెష‌ల్ పాట‌ల్లో కూడా కనబడుతూ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత వినోదం పంచుతున్నారు. అల్లు అర్జున్ సినిమా పుష్ప‌లో 'ఉ.. అంటావా మామా' అనే మాస్ పాట‌లో స‌మంత న‌ర్తించారు. ఆ పాట‌తో ఆమె టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను కూడా మెప్పించారు. ఇటీవలే స‌మంత మ‌రో మాస్ పాట‌లో కూడా న‌టించేందుకు ఓకే చెప్పార‌ట‌.

పుష్ఫ‌లో స్పెష‌ల్ సాంగ్‌లో అద‌ర‌గొట్టిన సామ్

'ఉ.. అంటావా మామా' పాట‌లో అల్లు అర్జున్, స‌మంత‌ (Samantha) ల స్టెప్పులు చూస్తే ఎవరైనా ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఇద్ద‌రూ టాప్ స్టార్లే. కానీ ఇదే మాస్ పాట‌లో బ‌న్నీ, సామ్ ఇద్దరూ ఇర‌గ‌దీశారు. ఆ పాట మ్యూజిక్ ప్రియుల‌ను ఎంత‌గానో అల‌రించింది.

ఇక 'ఉ.. అంట‌వా మామా' త‌ర్వాత స‌మంత మ‌రో మాస్ పాట‌లో న‌టించనున్నార‌ట‌.  పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతున్న 'య‌శోద‌'లో ప్రస్తుతం సమంత న‌టిస్తున్నారు. ఆ సినిమాలో ఆమె మరో స్పెష‌ల్ సాంగ్‌‌తో తన అభిమానులకు క‌నువిందు చేయ‌నున్నార‌ట‌. 

 

ఫ్యామిలీ మ్యాన్ 2 షూటింగ్ కంటే ముందు స‌మంత (Samantha) య‌శోద చిత్రానికి ఓకే చెప్పారు.

య‌శోద కోసం స‌మంత మాస్ సాంగ్

'య‌శోద' సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌యింది. ఒక్క పాట మిన‌హా 'య‌శోద‌' షూటింగ్ మొత్తం పూర్త‌యింద‌ని చిత్ర యూనిట్ తెలిపింది. హైద‌రాబాద్‌లో వేసిన ప్రత్యేమైన సెట్‌లో స్పెష‌ల్ సాంగ్ షూటింగ్ జరగనుంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ మణిశర్మ అందించిన పాట‌కు స‌మంత డాన్సుల‌తో అద‌ర‌గొట్ట‌నుంది. ఈ సాంగ్ 'ఊ అంటావా మామా'  పాటను మించి హిట్ అయ్యేలా చిత్రీక‌రించాల‌ని ద‌ర్శ‌కులు భావిస్తున్నార‌ట‌. య‌శోద చిత్రానికి హరి, హరీష్‌లు దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టులో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

 

 

ఫ్యామిలీ మ్యాన్ 2 షూటింగ్ కంటే ముందు స‌మంత (Samantha) య‌శోద చిత్రానికి ఓకే చెప్పారు.

'ఫ్యామిలీ మ్యాన్ 2' షూటింగ్ కంటే ముందు స‌మంత (Samantha) 'య‌శోద' చిత్రానికి ఓకే చెప్పారు. 'య‌శోద‌'లో యాక్ష‌న్ సీన్స్‌ను దర్శకులు ఓ రేంజ్‌లో చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. ఆ సీన్ల కోసం తొలుత డూప్ సహాయం తీసుకోవాలని భావించారట. కానీ స‌మంత డూప్ అవసరం లేదని.. తానే స్వయంగా ఆ పోరాట దృశ్యాలలో న‌టిస్తాన‌ని చెప్పార‌ట‌. 

Read More: Samantha Ruth Prabhu: పెళ్లి త‌ర్వాత జీవితం వైలెంట్‌గా ఉంటుంది -  నాగ‌చైత‌న్య‌పై స‌మంత సెటైర్లు



 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!