సమంత (Samantha Ruth Prabhu) ఒప్పుకుంటే ‘యశోద’ (Yashoda)కు సీక్వెల్.. ఆమె కోలుకున్నాక అప్‌డేట్!

Updated on Nov 18, 2022 10:53 AM IST
సమంత (Samantha Ruth Prabhu) ఒప్పుకుంటే ‘యశోద’ (Yashoda) చిత్రానికి సీక్వెల్స్ వచ్చే చాన్స్ ఉందని మేకర్స్ తెలిపారు
సమంత (Samantha Ruth Prabhu) ఒప్పుకుంటే ‘యశోద’ (Yashoda) చిత్రానికి సీక్వెల్స్ వచ్చే చాన్స్ ఉందని మేకర్స్ తెలిపారు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) నటించిన ‘యశోద’ (Yashoda) చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో.. బాక్సాఫీస్ వద్ద ‘యశోద’ జోరు చూపిస్తోంది. ముఖ్యంగా ఏ సెంటర్లు, మల్టీప్లెక్సుల్లో ఈ సినిమా వసూళ్లు చాలా బాగున్నాయని ట్రేడ్ టాక్. సమంత అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఈ మూవీ సక్సెస్ ఆమెలో సరికొత్త ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. అదేవిధంగా సామ్ అభిమానులు కూడా తమ నటి సూపర్బ్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చారని ఆనందంలో మునిగిపోతున్నారు. 

సరోగసి నేపథ్యంలో వచ్చిన ‘యశోద’ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు సమంత. ఆమె టైటిల్‌ పాత్రలో నటించిన ‘యశోద’ చిత్రాన్ని హరి-హరీష్‌ సంయుక్తంగా తెరకెక్కించారు. శివలెంక కృష్ణప్రసాద్‌ ఈ మూవీని నిర్మించారు. ప్రముఖ నటులు వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ఉన్ని ముకుందన్‌ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా మేకర్స్ ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఈ మూవీకి సీక్వెల్ తీసే చాన్స్ ఉందని తెలిపారు.

 ‘యశోద’ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు సమంత

‘యశోద’ను ఓ ఫ్రాంచైజీలా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని చిత్ర బృందం పేర్కొంది. సమంత ఒప్పుకుంటే సీక్వెల్ పట్టాలెక్కిస్తామని మేకర్స్ తెలిపారు. ‘యశోద 2’ విషయంలో మా దగ్గర ఓ ఆలోచన ఉంది. అంతేకాదు మూడో భాగానికీ ఒక లీడ్‌ ఉంది. సమంత పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన తర్వాత.. ఆమెతో కూర్చొని చర్చిస్తాం. తను ఒప్పుకుంటే వెంటనే సీక్వెల్స్‌ పట్టాలెక్కిస్తాం. మా నిర్మాత కూడా అందుకు సిద్ధంగా ఉన్నారు. సెకండ్ పార్ట్‌లో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ క్యారెక్టర్ కూడా ఉంటుంది. అలాగే మా మూవీలో సూపర్‌ సైంటిస్ట్‌ ఉన్ని ముకుందన్‌ ఉన్నారు. ఆయన కూడా ఏమైనా చేయగలడు (నవ్వుతూ)’ అని చిత్ర దర్శకులు హరి–హరీష్ పేర్కొన్నారు.

కాగా, సమంత ఆరోగ్యంపై కొంతకాలంగా పలు రకాల రూమర్స్ తెరపైకి వచ్చాయి. సామ్ అనారోగ్యంగా ఉన్నారని.. ఆమె చికిత్స తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇటీవల సమంత స్పందించారు. తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని ఆమె వెల్లడించారు. ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న ఒక ఫొటోను ఆమె షేర్ చేశారు. కొన్ని నెలల నుంచి ‘మయోసైటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నానని సమంత తెలిపారు. ఈ విషయాన్ని పూర్తిగా కోలుకున్న తర్వాత అందరితో చెబుదామని అనుకున్నానని.. కానీ అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతోందన్నారు. మనం ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ముందుకు వెళ్లలేమని అర్థం చేసుకున్నానని సమంత వివరించారు.

Read more: Samantha : మరో సినిమాకు సమంత గ్రీన్‌సిగ్నల్‌! దర్శకుడు ఎవరో తెలుసా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!