Junior NTR: ఆహ్లాదకరమైన వాతావరణంలో భార్య లక్ష్మీ ప్రణతి (Lakshmi Pranathi) తో ఎన్టీఆర్.. ఫొటో వైరల్!

Updated on Aug 01, 2022 09:48 PM IST
ఎన్టీఆర్ (NTR), ప్రణతి (Lakshmi Pranathi) కాఫీ తాగుతూ తన భార్య కోసం కొనుగోలు చేసిన ఫామ్ హౌజ్ లో (NTR Farm House) సరదాగా గడిపారు.
ఎన్టీఆర్ (NTR), ప్రణతి (Lakshmi Pranathi) కాఫీ తాగుతూ తన భార్య కోసం కొనుగోలు చేసిన ఫామ్ హౌజ్ లో (NTR Farm House) సరదాగా గడిపారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Junior NTR) బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ తన అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాలో కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు వినికిడి. ఇది ఎన్టీఆర్ కు 30వ చిత్రం కావడం విశేషం.        

అయితే.. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి కూడా సమయం కేటాయిస్తాడు తారక్‌. అప్పుడప్పుడు తన వ్యక్తిగత ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో వదులుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. తాజాగా సోషల్ మీడియాలో తారక్‌ పెట్టిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతి (Lakshmi Pranathi) తో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నాడు. 

ఎప్పుడో గానీ కనిపించని ఇలాంటి రేర్ పిక్ ను ఎన్టీఆర్ తాజాగా అభిమానులతో పంచుకోవడం పట్ల ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పిక్ లో ఎన్టీఆర్, ప్రణతి కాఫీ తాగుతూ తన భార్య కోసం కొనుగోలు చేసిన ఫామ్ హౌజ్ లో (NTR Farm House) సరదాగా గడిపారు. ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ స్వీట్ మెమోరీస్ క్రియేట్ చేసుకుంటున్నారు. అయితే.. ఎన్టీఆర్ ఈ ఫోటో ను పోస్ట్ చేసిన కొద్ది సేపటికే భారీగా లైక్స్, కామెంట్స్, షేర్ లతో వైరల్ అవుతోంది.    

4 ఏళ్ళ పాటు ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) చిత్రానికే అంకితమైన ఎన్టీఆర్ కు.. ఇప్పుడు కాస్త పెద్ద బ్రేకే దొరికింది. మార్చి 25న విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.1200 కోట్ల వరకు గ్రాస్ ను కొల్లగొట్టింది. ఈ మూవీలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. తన పాత్రకి దేశ విదేశాల ప్రేక్షకుల నుండి మంచి అప్లాజ్ వచ్చింది.

Read More: 'బింబిసార' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నందమూరి అభిమానుల కోలాహలం.. ఎన్టీఆర్ కు ఘన స్వాగతం.. వీడియో వైరల్!

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!