Junior NTR: భార్య లక్ష్మీ ప్రణతి (Lakshmi Pranathi) కోసం ఎన్టీఆర్ ఖరీదైన బహుమానం.. ఆ భవంతి పేరేంటో తెలుసా?

Updated on Jul 19, 2022 01:46 PM IST
లక్ష్మీ ప్రణతి, ఎన్టీఆర్‌ దంపతుల వివాహం 5 మే 2011 తేదిన హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.
లక్ష్మీ ప్రణతి, ఎన్టీఆర్‌ దంపతుల వివాహం 5 మే 2011 తేదిన హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (Hero NTR) ప్రస్తుతం వరుస విజయాలతో ఊపుమీదున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది విడుద‌లైన RRR సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎన్టీఆర్ సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. తారక్ తన కెరీర్ పరంగా భారీ విజయాలను అందుకోవడంలో భార్య లక్ష్మీ ప్రణతి పాత్ర కూడా కొంతమేర ఉందని ఆయన అభిమానులు భావిస్తారు. లక్ష్మీ ప్రణతి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా కూడా తారక్ నటించిన సినిమాలను మాత్రం బాగానే ఇష్టపడతారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్‌కు సంబంధించిన వార్త ఒక‌టి నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. లక్ష్మీప్రణతి (Lakshmi Pranathi) పుట్టినరోజు సందర్భంగా తారక్.. ఆమెకు ఖరీదైన బహుమతిని ఇచ్చారని సమాచారం. ఆరున్నర ఎకరాల ఫామ్ హౌస్‌ను ఎన్టీఆర్ తన భార్యకు బహుమతిగా ఇచ్చారని తెలుస్తోంది.

తాత‌య్య నుంచి వ‌స్తోన్న సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ త‌న ఇంటికి ‘బృందావ‌నం’ (Brindavanam) అనే పేరు పెట్టారట ఆయన. తారక్ ఇచ్చిన గిఫ్ట్ వల్ల లక్ష్మీ ప్రణతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయని తెలుస్తోంది. 

కాగా, టాలీవుడ్ (Tollywood) లో ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలకు సొంత ఫామ్ హౌస్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఎన్టీఆర్ కూడా చేరారు. 6.5 ఎకరాల్లో ఈ ఫామ్ హౌస్‌ని కోట్ల రూపాయల ఖర్చుతో అత్యంత అందంగా నిర్మించారట. ఈ ఫామ్ హౌస్ ఫొటోలు ఎప్పుడు బయటకి వస్తాయా అని ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు.

ఇక ఎన్టీఆర్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. కొరటాల శివ (Koratal Shiva) దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం తారక్ ప్రస్తుతం బరువు తగ్గే పనిలో బిజీగా ఉన్నారు. తారక్ కొత్త లుక్ ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఉండనుందని తెలుస్తోంది. సెప్టెంబర్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. 2023 సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీ తారక్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Read More: Junior NTR & Ram Charan: ప్రపంచవ్యాప్తంగా RRR కొత్త రికార్డు.. ట్విటర్‌లో నెం. 1 సినిమా టైటిల్ ఇదే !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!