RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ కు 32 రోజుల షూటింగ్.. వీడియో వైరల్!
RRR Movie: భారతదేశ సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న సినిమాల్లో ఆర్‌ఆర్‌ఆర్ ఒకటి. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అద్భుత దర్శకత్వ ప్రతిభ. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల (NTR) నటన సినిమాకు అద్భుతమైన విజయాన్నిచ్చాయి. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలై..ప్రపంచ వ్యాప్తంగా భారీగానే కలెక్షన్లను రాబట్టింది. ప్రస్తుతం జీ5 ఓటీటీ లో కూడా సత్తా చాటుతూ బాగా దూసుకుపోతోంది RRR. 1920 బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామా ఈ ఏడాది మార్చి 25న థియేటర్స్‌లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసి రూ.1200 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
ఈ సినిమాలో ఒక సన్నివేశం ఒక అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా హీరోలు ఇంట్రడక్షన్ సీన్స్ కోసం రాజమౌళి (Rajamouli) ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని చేసినట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి సన్నివేశాలలో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ కూడా ఒకటి.. ఇందులో పోలీస్ అధికారి పాత్రలో రామ్చరణ్ అద్భుతమైన నటన ప్రదర్శించారు అయితే తాజాగా చిత్రబృందం ఈ సన్నివేశానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన ఈ విషయాన్ని వీడియోని అభిమానులతో పంచుకుంది. వాటికి సంబంధించిన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
RRR మూవీ రిలీజ్ తర్వాత చిత్ర యూనిట్ సినిమా కోసం ఎవరెలా కష్టపడ్డారు.. సినిమాలో విఎఫ్‌ఎక్స్ సన్నివేశాలను ఎలా ప్లాన్ చేశారు అనే దాన్ని తెలియజేస్తూ వీడియోలను విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే కొన్ని RRRకు సంబంధించిన వి.ఎఫ్.ఎక్స్ వీడియోలు విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో రామ్ చరణ్ (Ram Charan) ఎంట్రీకి సంబంధించిన వి.ఎఫ్.ఎక్స్ వీడియో (RRR VFX video)ను విడుదల చేశారు. ఈ వీడియోను విడుదల చేయటంతో పాటు ఓ ఆసక్తికరమై విషయాన్ని తెలియజేశారు. అదేంటంటే.. ఈ సన్నివేశాన్ని 32 రోజుల పాటు చిత్రీకరించారు. వెయ్యి మందికి పైగా జనాల మధ్య రామ్ చరణ్‌తో చిత్రీకరించిన ఈ యాక్షన్ సన్నివేశాన్ని థియేటర్స్‌లో చూసిన జనాలకు గూజ్ బంప్స్ వచ్చాయి. అయితే దాని వెనుక 32 రోజుల కష్టం ఉందని చిత్ర యూనిట్ తెలియజేశారు.
ఈ అద్భుతమైన ఫైటింగ్ సీక్వెన్స్ ను ఎలా తెరకెక్కించారు మీరు కూడా ఒకసారి చూస్తే ఆశ్చర్యపోతారు. ఇక కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా లోని ట్రైన్ సన్నివేశాన్ని కూడా ఇలాంటి వీడియో ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇలా సినిమాలకు సంబంధించి పలు వీడియోలను విడుదల చేస్తూ.. వారు పడ్డ కష్టాన్ని కూడా తెలుపుతూ ఉంది చిత్రబృందం (RRR Movie Unit). ఏదేమైనా ఈ క్రెడిట్ అంతా రాజమౌళి కే వెళ్తుంది అని చెప్పవచ్చు.
కాగా, RRRలో మన్యం వీరుడు అల్లూరి సీతా రామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించగా.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు. ఇంకా ఆలియా భట్ (Alia Bhatt), అజయ్ దేవగణ్(Ajay Devagan) తదితరులు సినిమాలోకీలక పాత్రల్లో కనిపించారు. వీరితో పాటు హాలీవుడ్ నటులు ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి తదితరులు నటించారు. ఐదు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో దానయ్య ఈ సినిమాను నిర్మించారు.