డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో "ఆర్.ఆర్.ఆర్."(RRR)!.. జ‌పాన్ లోనూ రాజ‌మౌళి చిత్రం విడుద‌ల

Updated on Jul 26, 2022 12:46 PM IST
RRR: నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన ఆర్.ఆర్.ఆర్. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో కూడా వ‌చ్చేసింది. 
RRR: నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన ఆర్.ఆర్.ఆర్. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో కూడా వ‌చ్చేసింది. 

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లై బ్లాక్ బాస్ట‌ర్‌గా నిలిచిన చిత్రం ఆర్.ఆర్.ఆర్(RRR). వేల కోట్ల రూపాయ‌ల‌ను కొల్ల‌గొట్టి ఆర్.ఆర్.ఆర్ ఇండియ‌న్ సినిమా రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల న‌ట‌న‌కు ప్ర‌పంచ సినీ వ‌ర్గాల నుంచి ప్ర‌శంస‌లు అందుతున్నాయి. ఓటీటీ సంస్థ‌ నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన ఆర్.ఆర్.ఆర్. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. ప్ర‌స్తుతం ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో కూడా వ‌చ్చేసింది. 

డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఆర్.ఆర్.ఆర్.

'రౌద్రం రణం రుధిరం (RRR)' చిత్రం ఇప్ప‌టికే నెట్‌ఫిక్స్‌లో భారీగా లాభాలు తెచ్చిపెడుతుంది. జీ 5లో కూడా ప‌లు భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతూ మంచి బిజినెస్ చేస్తుంది. ఇక ఈ చిత్రం తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కూడా స్ట్రీమింగ్ అవ‌నుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం భాష‌ల్లో అందుబాటులోకి వ‌చ్చింది. ఆర్.ఆర్.ఆర్. చిత్రానికి వ‌స్తున్న ఆద‌ర‌ణ చూసి డిస్నీ ప్లస్  హాట్ స్టార్ ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌కు భారీ రేటు చెల్లించి.. సొంతం చేసుకుంది. 

 

అద్భుతమైన వండర్

ప్రస్తుతం తాజాగా మరో రికార్డును కూడా సొంతం చేసుకుంది RRR. వరల్డ్ వైడ్‌గా ఎక్కువసార్లు ట్వీట్ చేయబడిన సినిమా టైటిల్‌గా RRR ప్రథమ స్థానంలో నిలిచి కొత్త రికార్డును తిరగరాసింది. తాజాగా ఎవరో ఈ చిత్రానికి సంబంధించిన ఓ యాక్షన్ సీన్‌ను వీడియో క్లిప్ రూపంలో సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. 

జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) వన్యప్రాణులతో బ్రిటీషర్ల మీదకు దూసుకెళ్లే సీన్ అది. ఇప్పుడు అదే సీన్ హాలీవుడ్‌లో చర్చలకు దారితీస్తోందట. 

హాలీవుడ్ అవార్డు అందుకున్న ఆర్.ఆర్.ఆర్.

అల్లూరి సీతారామ‌రాజును పోలిన విప్లవ యోధుడి పాత్రలో రామ్ చ‌ర‌ణ్ (Ram Charan), కొమురం భీమ్‌ని పోలిన సాయుధవీరుడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ (NTR) ఈ సినిమాలో న‌టించారు. ఇదే సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. 'హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్'కు ఉత్తమ చిత్ర విభాగంలో ఆర్.ఆర్.ఆర్ (RRR) రెండో స్థానంలో నిలిచింది. త్వ‌ర‌లో ఆర్.ఆర్.ఆర్. సినిమాను జ‌పాన్‌లోనూ రిలీజ్ చేశారు. ఈ విష‌యాన్ని ఆర్.ఆర్.ఆర్ చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు.

Read More: RRR: 'భీమా నిన్ను క‌న్న నేల త‌ల్లి గ‌ర్వ‌ప‌డుతుంది'... ఇజ్రాయెల్ ప‌త్రిక‌ల్లో ఎన్టీఆర్( NTR) క‌థ‌నాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!