RRR: ఎన్టీఆర్ (NTR) పులిని ఎలా బంధించాడో తెలుసా!..మరోసారి తన ధీరత్వం చూపిన రాజమౌళి
RRR: 'ఆర్ఆర్ఆర్' సినిమా సక్సెస్ వెనుక నటీనటుల కష్టంతో పాటు టెక్నిషియన్ల శ్రమ కూడా అంతే ఉంది. 'ఆర్ఆర్ఆర్' కోసం చిత్ర యూనిట్ సభ్యులు నాలుగేళ్లు కష్టపడ్డారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో ముఖ్యంగా ఎన్టీఆర్ (NTR) పులిని బంధించే సీన్ హైలెట్‌గా నిలిచింది. ఆ సీన్ కోసం ఎలాంటి హార్డ్ వర్క్ చేశారో తెలుసా?. ఆ వివరాలతో కూడిన వీడియోను 'ఆర్ఆర్ఆర్' సినిమా విజువల్స్ ఎఫెక్ట్ సూపర్‌వైజర్ శ్రీనివాస్ మోహన్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
విజువల్ వండర్‌గా 'ఆర్ఆర్ఆర్'
'రౌద్రం రణం రుధిరం' (RRR) సినిమా విజువల్ వండర్‌గా తెరకెక్కింది. ఎన్టీఆర్ (NTR) పులిని బంధించే సీన్‌ను ఎలా చిత్రీకరించారో తెలిపే వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. రాజమౌళి ముందుగా ఫైట్ మాస్టర్‌తో ఆ సీన్ ఎలా చిత్రీకరించాలో ప్రాక్టీస్ చేయించారు. ఆ తరువాత ఎన్టీఆర్ ఓ పులి పొజిషన్‌లో ఉండే ఫైటర్‌తో తలపడ్డారు. విజువల్ ఎఫెక్ట్‌తో ఫైటర్ స్థానంలో పులి విజువల్స్ పెట్టారు. ఎన్టీఆర్ నిజంగానే పులితో ఫైట్ చేశారా అన్నట్లు సీన్‌ను చిత్రీకరించారు. ఈ సినిమాకు విజువల్స్ ఎఫెక్ట్ సూపర్‌వైజర్ శ్రీనివాస్ మోహన్ అద్భుతంగా వర్క్ చేశారు.
పులి ఫైట్ వైరల్
ప్రస్తుతం ఎన్టీఆర్ పులిని బంధించే మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సీన్‌తో పాటు బ్రిటీష్ కోటపై ఎన్టీఆర్ జంతువులతో దాడి చేసే సీన్ కూడా హైలెట్‌గా నిలిచింది. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో విజువల్స్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని అలరించాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పులిని బంధించే సీన్ హాలీవుడ్ రేంజ్‌లో పాపులర్ అయింది. 'ఆర్ఆర్ఆర్' ప్రపంచ వ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది.
హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు ప్రపంచ వ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవ్ గణ్, శ్రియా కీలక పాత్రలో కనిపించారు. డీవీవీ దానయ్య దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో ఆర్ఆర్ఆర్ నిర్మించారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు.