'లైగ‌ర్‌' (Liger) చిత్రాన్ని ఓటీటీలో నాలుగు భాష‌ల్లో రిలీజ్ చేసిన మేక‌ర్స్

Updated on Sep 22, 2022 11:57 AM IST
'లైగ‌ర్' (Liger) సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో విడుద‌ల కానుంది.
'లైగ‌ర్' (Liger) సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో విడుద‌ల కానుంది.

టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన మొద‌టి పాన్ ఇండియా సినిమా 'లైగ‌ర్' (Liger) డిజాస్ట‌ర్‌గా మిగిలింది. కానీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు మాత్రం ఫ్యాన్ పాలోయింగ్ ఇండియా లెవ‌ల్‌లో పెరిగింది. స్టార్ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో 'లైగ‌ర్' రిలీజ్ అయింది. ఈ సినిమాను అత్యంత భారీ బ‌డ్జెట్‌తో బాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత క‌ర‌ణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీకౌర్ నిర్మించారు. 'లైగ‌ర్' సినిమా వ‌సూళ్లు రోజు రోజుకు త‌గ్గిపోతున్నాయి. అనుకున్నంత బిజినెస్ చేయ‌క‌పోవ‌డంతో మేక‌ర్స్ ఓటీటీలోకి ముందే రిలీజ్ చేశారు. 

అప్పుడే ఓటీటీలోకి

'లైగ‌ర్' సినిమా ఆగ‌స్టు 25 తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌ను ఓ రేంజ్‌లో నిర్వ‌హించారు మేక‌ర్స్. కానీ మొద‌టి రోజు నుంచి నెగెటీవ్ టాక్ మూట‌క‌ట్టుకుంది. ఈ సినిమా చూసిన ప్రేక్ష‌కులు పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం ఇలా ఉందేటంటూ పెద‌వి విరిచారు. విడుద‌లై నెల రోజులు కాక‌ముందే మేక‌ర్స్ ఓటీటీలోకి రిలీజ్ చేశారు. 'లైగ‌ర్' సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఈ సినిమా హిందీ వ‌ర్ష‌న్ మాత్రం స్ట్రీమింగ్‌కు ఆల‌స్యం కానుంద‌ని స‌మాచారం. 

'లైగ‌ర్' (Liger) సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే న‌టించారు. అలాగే ర‌మ్య‌కృష్ణ విజ‌య్ త‌ల్లి పాత్ర‌లో న‌టించారు. ప్ర‌పంచ ఫైట‌ర్ మైక్ టైస‌న్ కూడా స్పెష‌ల్ రోల్‌లో న‌టించారు. 'లైగ‌ర్' సినిమా ఫ్లాప్ అవ‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న రెమ్యున‌రేష‌న్ కూడా తిరిగి ఇచ్చేశార‌ట‌. దాదాపు 6 కోట్ల రూపాయ‌ల‌ను వెన‌క్కు ఇచ్చేశార‌ట‌. 'లైగ‌ర్' ప్ర‌భావంతో  విజ‌య్, పూరీ కాంబినేష‌న్‌లో 'జ‌న‌గ‌ణ‌మ‌న' చిత్రీక‌ర‌ణ‌కు ఎన్నేళ్లు ప‌డుతుందోన‌ని సినీ క్రిటిక్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Read More: Liger : 'లైగర్' ఫ్లాప్ అవ్వడానికి కారణమేమిటి ? రామ్ గోపాల్ వర్మ (RGV) చెప్పిన టాప్ 5 పాయింట్స్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!