పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో అదరగొట్టిన రెజీనా, నివేదా థామస్.. 'శాకిని డాకిని' (Saakini Daakini) ట్రైలర్ రిలీజ్!

Updated on Sep 13, 2022 08:32 PM IST
ట్రైలర్ లో (Saakini Daakini Trailer) శాకిని డాకినిగా నివేదా, రెజీనా హ్యూమర్‌ను పండిస్తూనే యాక్షన్‌ ఎపిసోడ్లలోనూ అదరగొట్టారు.
ట్రైలర్ లో (Saakini Daakini Trailer) శాకిని డాకినిగా నివేదా, రెజీనా హ్యూమర్‌ను పండిస్తూనే యాక్షన్‌ ఎపిసోడ్లలోనూ అదరగొట్టారు.

అందాల భామలు రెజీనా కసాండ్రా (Regina Cassandra), నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం 'శాకిని డాకిని' (Saakini Daakini). సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్‌ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కింది ఈ చిత్రం. దక్షిణ కొరియా యాక్షన్ కామెడీ చిత్రం 'మిడ్‌నైట్ రన్నర్స్' సినిమాకి రీమే‌క్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక, ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజయిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.  

'శాకిని డాకిని' (Saakini Daakini) చిత్రం సెప్టెంబర్ 16న  థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. శిక్షణ కోసం పోలీసు అకాడమీలో చేరిన ఇద్దరమ్మాయిల కథతో ఈ సినిమా రూపొందినట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. యాక్షన్‌, డ్రామా, హాస్యం మేళవింపుగా ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. 

ట్రైలర్‌లో (Saakini Daakini Trailer) శాకిని, డాకిని పాత్రలలో నివేదా (Nivetha Thomas), రెజీనా హ్యూమర్‌ను పండిస్తూనే యాక్షన్‌ ఎపిసోడ్లలోనూ అదరగొట్టారు. ఓ పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లా మూవీని రూపొందించినట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. నివేదా ఫుడ్ లవర్‌గా, రెజీనా OCD  (Obsessive Compulsive Disorder) ఉన్న అమ్మాయిగా నటించారు. వీరిద్దరు ఒక పోలీస్ అకాడమీలో శిక్షణకి వస్తారు. తొలుత వీళ్లిద్దరి మధ్య అనేక కామెడీ సన్నివేశాలు ఉంటాయి. ఆ తర్వాత ఒకరోజు రాత్రి ఎవరో ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయడం చూసి.. వీళ్ళు తనను కాపాడటానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వా త ఏం జరిగిందనేదే ఈ సినిమా కథ.

'శాకిని డాకిని' సినిమా ట్రైలర్‌లోనే (Saakini Daakini Trailer) కథ మొత్తాన్ని దర్శకుడు ఇండైరెక్ట్‌గా చెప్పేశారు. ఇక, ట్రైలర్‌లోని ఇద్దరు కథానాయికల లుక్స్‌, పోరాట దృశ్యాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. మరి, వీరికి ఎదురైన సమస్యలేంటి? ఎందుకు ఇద్దరు సాధారణ అమ్మాయిలు పులుల్లా మారాల్సి వచ్చింది? మొదలైన విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Read More: "మీరు అందర్నీ ఇలాగే ప్రశ్నిస్తారా? మీ వద్ద ఇలాంటి ప్రశ్నలే ఉంటాయా" అంటూ రెజీనా (Regina Cassandra) ఫైర్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!