Jailer: ర‌జ‌నీకాంత్ (Rajinikanth) సినిమాలో ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ‌ (Ramya Krishnan)!

Updated on Aug 27, 2022 07:49 PM IST
Jailer: ర‌జ‌నీకాంత్  (Rajinikanth)  'జైల‌ర్‌' సినిమాలో ర‌మ్య‌కృష్ణ పాత్ర‌పై ప‌లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చల్ చేస్తున్నాయి.
Jailer: ర‌జ‌నీకాంత్ (Rajinikanth) 'జైల‌ర్‌' సినిమాలో ర‌మ్య‌కృష్ణ పాత్ర‌పై ప‌లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చల్ చేస్తున్నాయి.

Jailer: త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ (Rajinikanth) కొత్త సినిమా 'జైల‌ర్‌'పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ సినిమాలోని న‌టీన‌టుల వివ‌రాల‌ను మేక‌ర్స్ ఇటీవ‌లే ప్ర‌క‌టించారు. ర‌జ‌నీకాంత్ సినిమాలో ర‌మ్య‌కృష్ణ కూడా న‌టించ‌నున్నారు. ర‌మ్య‌కృష్ణ పాత్ర‌పై ప‌లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చల్ చేస్తున్నాయి. నెల్స‌న్ దిలీప్కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్ పిక్చ‌ర్స్ ఈ సినిమాను రూపొందిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఆగ‌స్టు 10 నుంచి ప్రారంభ‌మైంది. 

'జైల‌ర్' సినిమాలో ర‌జ‌నీకాంత్ (Rajinikanth) స‌ర‌స‌న న‌టించేందుకు ముందుగా ఐశ్వర్యరాయ్ బ‌చ్చ‌న్‌ను సంప్ర‌దించార‌ట‌. 'రోబో' సినిమాలో ర‌జ‌నీకాంత్, ఐశ్వర్యరాయ్ బ‌చ్చ‌న్ న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. మ‌ళ్లీ ఆ కాంబినేష‌న్‌ను రిపీట్ చేయాల‌నుకున్నారు. కానీ కుద‌ర‌క‌పోవ‌డంతో 'జైల‌ర్' కోసం ర‌మ్య‌కృష్ణ‌ను సంప్ర‌దించార‌ట‌. ప‌వ‌ర్ ఫుల్ పాత్ర కావ‌డంతో ర‌మ్య‌కృష్ణ ఈ సినిమాను ఓకే చేశార‌ట‌. 

 

Jailer: ర‌జ‌నీకాంత్  (Rajinikanth)  'జైల‌ర్‌' సినిమాలో ర‌మ్య‌కృష్ణ పాత్ర‌పై ప‌లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చల్ చేస్తున్నాయి.

ర‌జ‌నీతో ర‌మ్య‌కృష్ణ‌

'న‌ర‌సింహా' సినిమాలో ర‌మ్య‌కృష్ణ (Ramya Krishnan) త‌న న‌ట‌నతో ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ర‌జ‌నీకాంత్, రమ్య‌కృష్ణ కాంబినేష‌న్ సినిమాలు రావాల‌ని ప్రేక్ష‌కులు కోరుకుంటున్నారు. దీంతో ర‌మ్య‌కృష్ణ‌ను 'జైల‌ర్' సినిమాలో న‌టించేందుకు ఒప్పించారట‌. 'జైల‌ర్' సినిమాలో ర‌జ‌నీకాంత్, ర‌మ్య‌కృష్ణ సీన్లు హైలెట్‌గా నిల‌వ‌నున్నాయ‌ట‌. 'జైల‌ర్' సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో యోగిబాబు, వినాయకన్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.1

Read More: మాస్ లుక్ లో సూపర్ స్టార్ రజినీ కాంత్ (Rajinikanth).. 'జైలర్' మూవీ (Jailer First Look) ఫస్ట్ లుక్ రిలీజ్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!