Raviteja & Sriwas: వరుసగా సినిమాలు చేస్తున్న మాస్ మహారాజ్.. శ్రీవాస్ దర్శకత్వంలో రవితేజ!

Updated on Jul 31, 2022 06:50 PM IST
‘ల‌క్ష్యం’,‘లౌక్యం’వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన శ్రీవాస్(Sriwas) ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. 
‘ల‌క్ష్యం’,‘లౌక్యం’వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన శ్రీవాస్(Sriwas) ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. 

టాలీవుడ్ మాస్‌ మహారాజ ర‌వితేజ (Raviteja) ప్ర‌స్తుతం వ‌రుసగా సినిమాలు చేస్తూ తీరిక లేకుండా షూటింగ్‌ల‌లో పాల్గొంటున్నాడు. త్రినాథ్‌రావు న‌క్కిన ద‌ర్శ‌కత్వంలో ‘ధ‌మాకా’ సినిమాలో న‌టిస్తున్నాడు. ఇందులో 'పెళ్లి సందD' బ్యూటీ శ్రీలీలా హీరోయిన్‌గా న‌టిస్తుంది. దీనితో పాటుగా ‘రావ‌ణాసుర’, ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ చిత్రాల్లో హీరోగా న‌టిస్తున్నాడు. ఇక చిరు-బాబీ కాంబోలో తెర‌కెక్కుతున్న ‘వాల్తేరు వీర‌య్య’ సినిమాలోనూ ఓ కీల‌క‌పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవ‌లే ర‌వితేజ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. 

రవితేజ సంవత్సరానికి రెండు సినిమాల‌ను విడుద‌ల‌ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆయ‌న తాజా‌గా న‌టించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao On Duty) శుక్ర‌వారం విడుద‌లై మిశ్రమ టాక్ తెచ్చుకుంది. శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పూర్ ఓపెనింగ్స్‌ను రాబ‌ట్టింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం మాస్ మహారాజ అభిమానుల‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. 

ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం ర‌వితేజ మూడు సినిమాల‌ను ఒకేసారి సెట్స్‌పై ఉంచాడు. ఈ మూడు సినిమాలు ప్ర‌స్తుతం షూటింగ్‌ను జ‌రుపుకుంటున్నాయి. కాగా, తాజాగా ర‌వితేజ మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. గోపీచంద్ తో ‘ల‌క్ష్యం’, ‘లౌక్యం’, ‘డిక్టెట‌ర్’ వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన శ్రీవాస్ (Director Sriwas) ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. 

ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మించే అవకాశాలు కనపడుతున్నాయని తర్వలోనే అందుకు సంబంధించిన వార్తలు వెలువడే అవకాశాలు కనపడుతున్నాయి. శ్రీవాస్ ప్ర‌స్తుతం గోపీచంద్‌తో (Gopichand) సినిమా చేస్తున్నాడు. 'ల‌క్ష్యం', 'లౌక్యం' త‌ర్వాత ఈ కాంబోలో మూవీ తెర‌కెక్కుతుండటంతో ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. 

Read More: రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' నుంచి ‘నా పేరు సీసా..’ ఐటమ్ సాంగ్ రిలీజ్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!