అన్నయ్య చిరంజీవి (Chiranjeevi)కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) ఎమోషనల్ ట్వీట్

Updated on Aug 22, 2022 02:00 PM IST
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది

సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి ఎవరు అని అడిగితే ఎవరైనా ఠక్కున చెప్పే పేరు చిరంజీవి (Chiranjeevi). ఎంతో మంది తమ స్వయంశక్తితో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నా చిరంజీవికి వచ్చినంత క్రేజ్‌ కానీ ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరెవరికీ లేదంటే ఒప్పుకుని తీరాల్సిన నిజం.

ఇక, చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చి పవర్‌‌స్టార్‌‌గా ఎదిగారు పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్న పవన్.. తన అన్నయ్య చిరుపై ఉన్న అభిమానాన్ని వీలైన ప్రతిసారీ పబ్లిక్‌గా కూడా చెబుతూనే ఉంటారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది

ఇక, సోమవారం చిరంజీవి 67వ పుట్టినరోజు. సందర్భంగా పలువురు స్టార్లు, కుటుంబసభ్యులతోపాటు అభిమానులు కూడా సోషల్‌ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో పవర్‌‌స్టార్ పవన్ కల్యాణ్‌  కూడా  తన అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్విట్టర్‌‌లో ఎమోషనల్ పోస్ట్‌ పెట్టారు.

ట్వీట్‌ ద్వారా విషెస్..

‘నేను ప్రేమించే, గౌరవించే.. ఆరాధించే నా ప్రియమైన సోదరుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ ప్రత్యేకమైన రోజున మీకు మంచి ఆరోగ్యం, విజయం, కీర్తి దక్కాలని కోరుకుంటున్నాను అంటూ ప‌వ‌న్ (Pawan Kalyan) ట్విట్టర్‌లో పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలిపారు. సాయిధ‌రమ్ తేజ్, వ‌రుణ్‌తేజ్, శ్రీకాంత్‌, హ‌రీష్ శంక‌ర్, మెహెర్‌‌ రమేష్‌తో ప‌లువ‌రు సినీ సెల‌బ్రిటీలు చిరంజీవికి పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్‌డే వేడుక‌లు ఘ‌నంగా మొద‌ల‌య్యాయి. చిరంజీవి 67వ సంవ‌త్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు, రాజ‌కీయ నాయ‌కుల నుంచి చిరుకు బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇక అభిమానులు చిరంజీవి (Chiranjeevi) పోస్టర్లకు పాలాభిషేకాలు చేస్తూ విషెస్‌ను తెలియజేస్తున్నారు.  

Read More : HBD Chiranjeevi : చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా.. అభిమానులతో పాటు సెలబ్రిటీల శుభాకాంక్షల వెల్లువ

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!