పవన్ కల్యాణ్ హీరోగా నటించిన జల్సా (Jalsa Re Release) రీ రిలీజ్.. థియేటర్లలో ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదుగా..!

Published on Sep 05, 2022 08:44 PM IST

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఆయన ఫ్యాన్స్ ‘జల్సా’ 4కే వెర్షన్ ను గ్రాండ్ గా రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పవన్ ఫ్యాన్స్ హంగామా కనిపిస్తోంది. పవన్ కటౌట్‌కు పాలాభిషేకాలు చేస్తూ.. హారతలిస్తూ.. కొబ్బరి కాయలు కొడుతూ.. హంగామా చేస్తున్నారు. ఆ హంగామాతో నెట్టింట వైరల్ అవుతున్నారు. 

మరోవైపు.. మేనమామ చిత్రాన్ని చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన సాయి ధరమ్‌ తేజ్‌ (Sai dharam Tej) మెగా ఫ్యాన్స్‌తో కలిసి థియేటర్లో రచ్చ చేశాడు. తెరపైకి కాగితాలు విసురుతూ సినిమాను సాధారణ అభిమానిగా తేజ్‌ ఎంజాయ్‌ చేస్తున్న వీడియో మెగా ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది. ఇక ఆయన వీడియోను ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో రికార్డు క్రియేట్ చేసింది. పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ ను మెప్పించిన చిత్రమిది. ఎమోషనల్ టచ్ తో పాటు కమర్షియల్ గానూ మంచి మార్క్ క్రియేట్ చేసింది.

‘జల్సా’ (Jalsa) చిత్రంలో పవన్ కళ్యాణ్ - గోవా బ్యూటీ ఇలియానా (Ileana) కలిసి నటించారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ అందించిన ఆరు పాటలు బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. ఇప్పటికీ ఎప్పటికీ వినాలనిపించే సంగీతమది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించారు.

Read More: ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ హ‌ద్దులు దాటారు.. సంస్కారం నేర్పండి - లీలామ‌హ‌ల్ థియేట‌ర్ ఓన‌ర్