రథంపై దూసుకెళుతున్న పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan).. హరిహర వీరమల్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్

Updated on Sep 01, 2022 07:01 PM IST
పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది
పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది

భీమ్లానాయక్ సినిమా హిట్ తర్వాత ఫుల్‌ జోష్‌లో ఉన్నారు పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan). వకీల్‌సాబ్‌తో గ్రాండ్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చారు పవన్. రెండు సినిమాలు వరుసగా హిట్ కావడంతో పవన్‌ అభిమానుల ఫోకస్ అంతా ఆయన తర్వాతి సినిమాపై పడింది.

పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పోయినేడాది రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశాడు. అయితే పలు కారణాలతో షూటింగ్ లేట్‌ అయ్యింది. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా వేసవిలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది

వైరలవుతున్న ట్వీట్..

కాగా, ఈ సినిమా అప్‌డేట్స్ గురించి ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. శుక్రవారం పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ అప్‌డేట్‌ను రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే మేకర్స్‌ మాత్రం అభిమానులకు సర్‌‌ప్రైజ్ ఇచ్చారు. పవన్‌ బర్త్‌డే శుక్రవారం కాగా.. గురువారం సాయంత్రమే హరిహర వీరమల్లు స్పెషల్ పోస్టర్‌‌ను విడుదల చేశారు.

ఈ పోస్టర్‌లో ప‌వ‌న్ ర‌థంపై ర‌ణ‌రంగంలో శ‌త్రువుల‌పై యుద్ధం చేయ‌డానికి దూసుకెళుతున్నట్టు ఉంది. ‘స్వాగ‌తిస్తుంది స‌మ‌ర‌ప‌థం.. దూసుకొస్తుంది వీర‌మ‌ల్లు విజ‌య‌ప‌థం’ అంటూ క్రిష్ చేసిన ట్వీట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. హరిహర వీరమల్లు సినిమాలో ప‌వ‌న్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)కు జోడీగా నిధి అగ‌ర్వాల్, న‌ర్గీస్ ఫ‌క్రి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై ఏ. ద‌యాక‌ర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కీర‌వాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా పీరియాడిక‌ల్ యాక్షన్ డ్రామా నేప‌థ్యంలో తెలుగు, హిందీ, త‌మిళం, క‌న్నడ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కానుంది.

Read More : మహేష్‌బాబు (MaheshBabu) పోకిరి, పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) జల్సా సినిమాల రీరిలీజ్‌తో ఆనందంలో ఇలియానా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!