కోలీవుడ్ స్టార్ అజిత్ (Ajith) హీరోగా 'తునీవు' (Thunivu) ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫైర్

Updated on Sep 22, 2022 03:05 PM IST
 అజిత్ పోస్ట‌ర్ ను పవన్ బ్లాక్ బస్టర్ సినిమా 'వ‌కీల్ సాబ్' (Vakeel Saab) నుంచి కాపీ కొట్టార‌ని చెప్తున్నారు నెటిజన్లు.
అజిత్ పోస్ట‌ర్ ను పవన్ బ్లాక్ బస్టర్ సినిమా 'వ‌కీల్ సాబ్' (Vakeel Saab) నుంచి కాపీ కొట్టార‌ని చెప్తున్నారు నెటిజన్లు.

తమిళ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar) హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'తునీవు' (Thunivu). హెచ్. వినోత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా జీ స్టూడియోస్ తో క‌లిసి బోనీ క‌పూర్ నిర్మిస్తున్నాడు. అజిత్ కి ఇది 61వ సినిమా కావడం విశేషం.  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఈ మూవీ లోని అజిత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మూవీ యూనిట్ విడుదల చేసింది. 

'తునీవు' ఫస్ట్ లుక్ పోస్టర్ (Thunivu First Look Poster) లో అజిత్ పొడుగాటి కుర్చీలో కూర్చొని, చేతిలో గ‌న్ ప‌ట్టుకొని క‌ళ్లు మూసుకొని ఆలోచిస్తున్న‌ట్లు క‌నిపించాడు. ఇందులో అజిత్ తెల్ల గ‌డ్డం, హెయిర్ తో స్టైలిష్ లుక్ లో బాగానే క‌నిపించాడు. అయితే, ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేయడం మొదలు పెట్టారు.

దీనికి కారణం.. అజిత్ పోస్ట‌ర్ ను పవన్ బ్లాక్ బస్టర్ సినిమా 'వ‌కీల్ సాబ్' (Vakeel Saab) నుంచి కాపీ కొట్టార‌ని చెప్తున్నారు నెటిజన్లు. కాగా, వ‌కీల్ సాబ్ చిత్రంలో ప‌వ‌న్ కల్యాణ్ సామానులు తీసుకెళ్తున్న వ్యాన్ లో చైర్ లో కూర్చొని కాళ్లు చాపి బుక్ చ‌దువుతూ ఉంటాడు. అచ్చు గుద్దిన‌ట్లు ఆ పోస్ట‌ర్ ను అజిత్ వాడేశాడు అని అంటున్నారు. అయితే ఇక్క‌డ ప‌వ‌న్ (Pawan Kalyan) చేతిలో ఉన్న‌ది బుక్ అయితే.. అక్క‌డ అజిత్ చేతిలో ఉన్న‌ది గ‌న్‌.. అంతే తేడా.. మిగతాదంతా సేమ్ టు సేమ్ అని అంటున్నారు. 

అజిత్ హీరోగా నటించిన 'తునివు' మూవీ పోస్టర్

ఇదిలా ఉంటే.. దళపతి విజయ్ (Thalapathy Vijay) తాజా సినిమా 'వారసుడు' పోస్టర్ కూడా కాపీనే అని గుర్తు చేస్తున్నారు. చంద్ర‌ముఖి సినిమాలోని ర‌జ‌నీకాంత్ స్టైల్ ను విజ‌య్ కాపీ కొట్టిన‌ట్లు చెప్పుకొస్తున్నారు. ఇక ఇప్పుడు అజిత్ వంతు వ‌చ్చింది. ఇలా పోస్ట‌ర్లు కాపీ కొట్ట‌డం కాకుండా కొత్త‌గా ఆలోచించ‌డంటూ స‌ల‌హాలు ఇస్తున్నారు.

కోలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరో గా నటించిన అజిత్ ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. అజిత్ ఇప్పటికే తాను నటించిన కొన్ని చిత్రాలను తెలుగు లో కూడా డబ్ చేసి విడుదల చేసి టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకున్నాడు. కాగా, అజిత్ చివరిగా 'వలిమై' (Valimai) అనే చిత్రంలో నటించాడు.

Read More: Hero Ajith: సినిమాల్లోనే కాదు షూటింగ్ లోనూ సత్తా చాటుతున్న తమిళ్ తలైవా అజిత్ కుమార్.. 6 బంగారు పతకాలు కైవసం!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!