పొన్నియిన్ సెల్వన్ 1 (Ponniyin Selvan 1) 'రాచ్చ‌స మావ‌యా' సాంగ్ రిలీజ్..అల‌రించిన కార్తీ, శోభితాల హావ‌భావాలు !

Updated on Sep 13, 2022 09:03 PM IST
జానపద చిత్రం 'పొన్నియిన్ సెల్వన్ 1' (Ponniyin Selvan 1) మొద‌టి భాగం ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 30న  రిలీజ్ కానుంది.
జానపద చిత్రం 'పొన్నియిన్ సెల్వన్ 1' (Ponniyin Selvan 1) మొద‌టి భాగం ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 30న  రిలీజ్ కానుంది.

త‌మిళ స్టార్ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం  'పొన్నియిన్ సెల్వన్ 1' (Ponniyin Selvan 1). ఇటీవ‌లే రిలీజ్ అయిన‌ ఈ  సినిమా ట్రైల‌ర్ త‌మిళ‌నాట చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎంతో గ్రాండ్‌గా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్ ఈ సినిమా ట్రైల‌ర్‌ రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్. రెహ‌మాన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్ కూడా ఈ కార్యక్రమానికి హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం ఈ సినిమా నుంచి ఓ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేక‌ర్స్. 

ఆక‌ట్టుకున్న కార్తీ, శోభితాల న‌ట‌న‌
'రాచ్చ‌స మావ‌య' అంటూ సాగే ఈ పాట‌లో శోభిత ధూళిపాళ నటించారు. త‌న బావ‌ను ఆట‌ప‌ట్టించే పాట‌లో శోభిత న‌ట‌న ఆక‌ట్టుకుంది. ఇక కార్తీ హావ‌భావాలు అదిరిపోయాయి. ఆస్కార్ అవార్డు గ్ర‌హీత, ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్. రెహ‌మాన్ 'రాచ్చ‌స మావ‌య' పాట‌కు సంగీతం అందించారు. ఈ పాట‌ను శ్రేయ ఘోష‌ల్‌, శంక‌ర్ మ‌హ‌దేవ‌న్, మ‌హేష్ వినాయ‌క‌రామ్‌లు అద్భుతంగా ఆల‌పించారు. అనంత శ్రీరామ్ తెలుగులో లిరిక్స్ అందించారు.

పాన్ ఇండియా లెవ‌ల్‌లో జానపద చిత్రం 'పొన్నియిన్ సెల్వన్ 1' (Ponniyin Selvan 1) తెరకెక్కింది. ఈ సినిమా మొద‌టి భాగం ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 30న  రిలీజ్ కానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌తో కలిసి, మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై మ‌ణిర‌త్నం స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించారు. 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' చిత్రంలో చియాన్ విక్ర‌మ్‌, కార్తి, జయం రవి, ఐశ్వ‌ర్య‌రాయ్‌, త్రిష, బాబీ సింహ వంటి ప్ర‌ముఖులు న‌టించారు.

Read More: Ponniyin Selvan 1: 'పొన్నియిన్ సెల్వన్ 1' ట్రైల‌ర్ కోసం ఏక‌మైన కోలీవుడ్.. చోళ రాజుల పాల‌న‌పై మ‌ణిర‌త్నం సినిమా

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!