పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తా కానీ ఓ కండీషన్ - శివ కార్తికేయన్ (Sivakarthikeyan)
తమిళ నటుడు శివకార్తికేయన్ నటించిన డాన్ (Sivakarthikeyan) సినిమా నేడే రిలీజ్ అయింది. శిబిచక్రవర్తి దర్శకత్వంలో డాన్ తెరకెక్కింది. పాన్ ఇండియా సినిమాల్లో కూడా చేస్తానని అయితే అందుకు ఓ కండీషన్ ఉందని శివకార్తికేయన్ అంటున్నాడు.
తమిళ నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయిట్ మూవీస్ సంస్థ విడుదల హక్కులను సొంతం చేసుకుంది. శివ కార్తికేయన్ (Sivakarthikeyan)కు జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించారు. డాన్ సినిమా లైకా ప్రొడక్షన్, ఎస్.కే. ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించింది. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా సంగీతం అందించారు.
డాన్ సినిమా రిలీజ్ సందర్భంగా శివకార్తికేయన్ (Sivakarthikeyan) మీడియాతో మాట్లాడారు. పాన్ ఇండియా సినిమాలు చేయాలనుకుంటున్నారా అని ఓ రిపోర్టర్ శివకార్తికేయన్‌ను అడిగారు. పాన్ ఇండియా సినిమాల్లో అవకాశం వస్తే కచ్చితంగా చేస్తానని... కానీ కొత్త స్టోరి అయింటేనే చేస్తానని శివకార్తికేయన్ చెప్పారు.
డాన్ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అన్నారు శివకార్తికేయన్ (Sivakarthikeyan). దర్శకుడు శిబిచక్రవర్తి డాన్ మూవీ కథ చెప్పినప్పుడు కాలేజీ నేపథ్యంలో సాగే కథ అని చెప్పారు. తనకు కాలేజీ రోజులు గుర్తుకు వచ్చాయని.. కథ వినగానే డాన్ సినిమా చేస్తానని చెప్పారు శివకార్తికేయన్. ప్రస్తుతం శివకార్తికేయన్ నటించిన ఐలాన్ సినిమా తమిళ్‌తో పాటు.. ఇతర భాషల్లోనూ విడుదల చేయాలనుకుంటున్నారు.