లైగర్ సినిమాపై డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) సంచలన కామెంట్లు..ఫ్లాప్ అని ముందే తెలుసా!
భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వం వహించిన లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు పూరీ జగన్నాథ్, చార్మీ, కరణ్ జోహార్ నిర్మాతలుగా వ్యవహరించారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదలైంది. విడుదలైన నాలుగు రోజులకే రూ.100 కోట్లు వసూలు చేసి రికార్డులు క్రియేట్ చేసింది గాడ్‌ఫాదర్ సినిమా. ఈ సినిమాలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ జర్నలిస్ట్‌గా నటించారు. చిరంజీవికి వీరాభిమాని అయిన పూరీ.. గాడ్‌ఫాదర్ సక్సెస్ అయిన సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పలు విషయాలను పంచుకున్నారు.
చిరు అడిగిన ప్రశ్నకు..
పూరీ జగన్నాథ్ – చిరుకి మధ్య జరిగిన ఈ చిట్‌చాట్‌లో.. మెగాస్టార్ కూడా పూరీని పలు ప్రశ్నలు అడిగారు. మీరు అనుకున్న రిజల్ట్ రాకపోతే ఎలా తీసుకుంటారు అని చిరు అడిగిన ప్రశ్నకి పూరీ ఇలా బదులిచ్చారు. ‘లైఫ్‌లో హీలింగ్ టైమ్ తక్కువ ఉండాలి సార్. యుద్ధాలు జరిగినా, ప్రాణాలు పోయినా హీలింగ్ టైమ్ నెలకు మించి ఉండకూడదు. వేరే పనిలో పడిపోవాలి. కొన్నిసార్లు నమ్మినవాళ్లు కూడా ఫ్లిప్ అవ్వచ్చు. ఏమైనా జరగచ్చు. నేను లైగర్ సినిమా తీశాను. మూడు సంవత్సరాలు ఆ సినిమా కోసం పనిచేస్తూ చాలా ఎంజాయ్ చేశాను.
నటీనటులు, టెక్నీషియన్లు, మైక్ టైసన్ అందరూ కలిసి పనిచేశాం. కానీ సినిమా ఫ్లాప్ అయ్యింది. సినిమా ఫ్లాప్ అని తెలియడానికి వీకెండ్ వరకు ఆగాల్సిన పని లేకుండా పోయింది. ముందు శుక్రవారమే లైగర్ ఫ్లాప్ అని అర్ధమైపోయింది. సండే జిమ్‌కి వెళ్లాను. పది స్కాట్స్ చేశాను. నా స్ట్రెస్ మొత్తం రిలీజ్ అయిపోయింది. ప్రస్తుతానికి బాంబేలో ఉంటూ కొత్త కథలు ప్రిపేర్ చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)
Read More : ‘బద్రి’ నుంచి ‘లైగర్’ వరకు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) సినీ ప్రయాణం.. బర్త్ డే స్పెషల్‌గా మీకోసం