Allu Arjun: చెవిపోగుతో ఆల్ట్రా స్టైలిష్ లుక్‌లో అల్లు అర్జున్.. అదరగొడుతున్న లేటెస్ట్ ఫొటో!

Updated on Jul 29, 2022 06:37 PM IST
అల్లు అర్జున్(Allu Arjun) డబుల్ ఇయ‌ర్ రింగ్స్‌తో, న్యూ ఆల్ట్రా స్లైలిష్ లుక్‌లో మెరవ‌బోయే యాడ్ కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.
అల్లు అర్జున్(Allu Arjun) డబుల్ ఇయ‌ర్ రింగ్స్‌తో, న్యూ ఆల్ట్రా స్లైలిష్ లుక్‌లో మెరవ‌బోయే యాడ్ కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం 'పుష్ప 2' (Pushpa 2) కోసం సన్నద్ధమవుతున్నారు. క్రేజీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ఆగస్టు చివరి వారంలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అల్లు అర్జున్ న్యూ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ న్యూ లుక్ 'పుష్ప 2' కోసమా? అనే వార్తలు వస్తున్నాయి. 

అల్లు అర్జున్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌ (Allu arjun Photos Viral) అవుతున్నాయి. బన్నీ ప్రస్తుతం ఒక యాడ్ షూట్‌లో ఉన్నట్లు అందరికీ తెలిసిందే. హ‌రీష్ శంక‌ర్ (Harish Shankar) డైరెక్ష‌న్‌లో అల్లు అర్జున్ ఆస్ట్రాల్ పైప్స్ యాడ్ షూట్‌లో పాల్గొంటున్నాడు. 

కాగా సెలెబ్రిటీ ఫొటోగ్రాఫ‌ర్‌ అవినాష్ గోవారికర్ (Avinash Gowarikar) సెట్స్‌లో క్లిక్ మ‌నిపించిన‌ అల్లు అర్జున్ బీటీఎస్ స్టిల్స్‌ను షేర్ చేయ‌గా.. ప్రస్తుతం అవి నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. డబుల్ ఇయ‌ర్ రింగ్స్‌తో న్యూ ఆల్ట్రా స్లైలిష్ లుక్‌లో మెరవ‌బోయే ఈ యాడ్ కోసం అభిమానులు ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ యాడ్ త్వరలో విడుదల కానుంది.  

అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం సినిమాలతో పాటు.. యాడ్స్‌లో కూడా ఫుల్ బిజీగా మారిపోయాడు. ఈ స్టార్ హీరో ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో యాడ్ షూట్‌లో పాల్గొన్న ఫొటోలు ఇప్ప‌టికే నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అయితే, బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతున్న దృష్ట్యా పలు బ్రాండ్స్ ఆయనతో కలిసి పని చేయడానికి క్యూ కడుతున్నాయి.

ఇక, అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే..  పుష్ప 2 సినిమాలో ఫహద్ ఫాజిల్‏తోపాటు తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) సైతం కీలకపాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పుష్ప 2 మాత్రమే కాకుండా పుష్ప 3 కూడా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఫహాద్ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పుష్ప 2 (Pushpa ) సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

Read More: త్రివిక్రమ్ దర్శకత్వంలో యాడ్ షూట్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైలిష్ లుక్.. ఫొటోలు వైరల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!