VeeraSimhaReddy: భారీ ధరకు అమ్ముడైన బాలయ్య (Balakrishna) ‘వీరసింహారెడ్డి’ మూవీ ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్..?

Updated on Dec 06, 2022 06:32 PM IST
ఎస్ఎస్ తమన్ బాణీలు సమకూర్చుతున్న ‘వీరసింహారెడ్డి’ (VeeraSimhaReddy) నుంచి ఇటీవల రిలీజైన ‘జై బాలయ్య’ సాంగ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది
ఎస్ఎస్ తమన్ బాణీలు సమకూర్చుతున్న ‘వీరసింహారెడ్డి’ (VeeraSimhaReddy) నుంచి ఇటీవల రిలీజైన ‘జై బాలయ్య’ సాంగ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna)కు మాస్ ఆడియెన్స్‌లో ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘చెన్నకేశవరెడ్డి’, ‘లెజెండ్’ లాంటి సినిమాలు ఆయనకు బీ, సీ సెంటర్స్ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని కల్పించాయి. అయితే ‘అఖండ’ చిత్రంతో మాస్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ మనసులనూ బాలయ్య గెలుచుకున్నారు. కరోనాతో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ‘అఖండ’ మూవీ ద్వారా ప్రేక్షకులను థియేటర్లకు పోటెత్తించారు బాలయ్య. 

వరుస పరాజయాలతో సతమతవుతున్న బాలకృష్ణలో ‘అఖండ’ సినిమా విజయం సరికొత్త జోష్ నింపింది. ఆ తర్వాత ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ‘అన్‌స్టాపబుల్’ షోతో బాలయ్య చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తనదైన కామెడీ టైమింగ్‌తో సెలబ్రిటీలను ఆయన ఇంటర్వ్యూ చేసే విధానానికి అందరూ ఫిదా అవుతున్నారు. దీంతో ఆయన తర్వాతి సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.  

వరుస పరాజయాలతో సతమతవుతున్న బాలకృష్ణలో ‘అఖండ’ సినిమా విజయం సరికొత్త జోష్ నింపింది

‘క్రాక్’ సక్సెస్‌తో ఊపుమీదున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ‘వీరసింహారెడ్డి’ (VeeraSimhaReddy) చిత్రాన్ని చేస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్ ఇందులో నాయికగా నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ బాణీలు సమకూర్చుతున్న ‘వీర సింహా రెడ్డి’ నుంచి ఇటీవల రిలీజైన ‘జై బాలయ్య’ సాంగ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. 

సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ‘వీరసింహారెడ్డి’ మూవీ.. విదేశీ ప్రదర్శనల హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయాయట. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను పీహెచ్ఎఫ్, క్లాసిక్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా కొనుగోలు చేశాయని సమాచారం. గతంలో ఎన్నడూ లేనివిధంగా బాలయ్య సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.8 కోట్లకు అమ్ముడుపోయాయని వినికిడి. ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ కావడం, ‘అన్‌స్టాపబుల్’తో ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్‌లో బాలకృష్ణకు మరింత పాపులారిటీ పెరగడంతో ‘వీరసింహారెడ్డి’ కోసం రికార్డు ధర పెట్టడానికి బయ్యర్లు వెనుకాడలేదని తెలుస్తోంది. మరి, సంక్రాంతి రేసులో బాలయ్య చిత్రం ఎంతగా వసూలు చేస్తుందో చూడాలి. 

Read more: Mrunal Thakur: హీరోయిన్లు.. హీరోయిన్లుగానే చెయ్యాలా!.. అలాంటి పాత్రలు చేయొద్దా?: ట్రోలర్స్‌కు మృణాల్ కౌంటర్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!