మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ సినిమాపై కొత్త అప్డేట్ ?

Updated on Aug 29, 2022 04:51 PM IST
మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ కాంబినేషనులో వస్తున్న సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ కాంబినేషనులో వస్తున్న సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు (Mahesh Babu)-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబోలో SSMB28 అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇది ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో సినిమా కావడం మరో విశేషం. అయితే, వచ్చేనెల 2వ వారం నుంచి ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం. 

మరోవైపు.. ఎన్టీఆర్ (NTR) హీరోగా తెరకెక్కిన 'అరవింద సమేత'.. బన్నీ హీరోగా నటించిన 'అల వైకుంఠపురములో' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత త్రివిక్రమ్ చేస్తున్న సినిమా కావడంతో, ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.  

కాగా, త్రివిక్రమ్ (Trivikram Srinivas) తన సినిమాలలోని ముఖ్యమైన పాత్రలలో సీనియర్ హీరోలను, హీరోయిన్స్‌ను తీసుకుంటూ ఉంటాడు. ఇందులో భాగంగానే ఈ సినిమాలోని ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఆయన మాజీ లవర్ బాయ్ తరుణ్‌ను సంప్రదించినట్లుగా సమాచారం. 

కీలక పాత్రలో తరుణ్ 

అయితే, వరుస పరాజయాలతో కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరమయిన తరుణ్‌ మళ్లీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా తరుణ్‌ హీరోగా నటించిన 'నువ్వే నువ్వే' సినిమాతోనే త్రివిక్రమ్‌ (Trivikram).. డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన దర్శకత్వంలో తరుణ్‌ కనిపించనున్నట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

మరి, ఇదే నిజం అయితే తరుణ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి హిట్ అందుకుంటాడా లేదా? చూడాలి. ఇక ఈ మూవీలో మహేష్‌కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Read More: మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన మేకర్స్.. ఆనందంలో ఫ్యాన్స్

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!