ఇలాంటి బలమైన మహిళను ఇంతవరకు చూడలేదు: రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ట్వీట్

Updated on May 02, 2022 10:39 PM IST
 రాంగోపాల్‌ వర్మ  (Ram Gopal Varma) ట్వీట్‌ చేసిన వీడియో
రాంగోపాల్‌ వర్మ (Ram Gopal Varma) ట్వీట్‌ చేసిన వీడియో

ఎప్పుడూ వివాదాల్లో ఉండే రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma).. టాలీవుడ్‌లో జరుగుతున్న ఒక వివాదంపై ట్వీట్‌ చేసి ఆ అంశంపై మరింత ఆసక్తిని రేకెత్తించాడు. యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌ నటించిన ‘అశోక వనంలో అర్జున కల్యాణం’ సినిమా ప్రమోషన్‌ను వెరైటీగా ప్లాన్ చేద్దాం అనుకుంది ఆ చిత్ర బృందం. అనుకున్నట్టుగానే నడిరోడ్డుపై ప్రాంక్ వీడియో చేసింది. అది కాస్తా బెడిసికొట్టి ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అంతేనా.. దానిపై ప్రజలతోపాటు మీడియా వారు కూడా విమర్శలు చేయడం మొదలు పెట్టారు. సినిమా ప్రమోషన్‌ కోసం నడిరోడ్డుపై ప్రాంక్ వీడియో చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడంతో హ్యూమన్ రైట్స్ కమిషన్‌లో ఒక లాయర్‌‌ కేసు కూడా వేశారు.

ఇక అక్కడితో ఆ కథ ముగిసింది అనుకోవద్దు. ఇదే అంశంపై ఒక టీవీ ఛానల్‌లో ఓ కార్యక్రమం జరుగుతోంది. ఆ ఛానల్‌లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యాంకర్‌‌, హీరో విశ్వక్‌ సేన్‌‌ల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆ యాంకర్ విశ్వక్‌పై ఫైర్ అయ్యింది. గెట్‌ అవుట్‌ ఆఫ్‌ మై స్టూడియో అంటూ అరిచేసింది. ఈ ఘటనపై చాలామంది రకరకాలుగా స్పందింస్తున్నారు.

ఇక, డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కూడా ఈ అంశంపై తనదైన శైలిలో స్పందించారు. ‘ఇప్పటివరకు ఓ మగాడి కంటే పవర్‌‌ఫుల్‌ మహిళను చూడలేదు. ఆమె సర్కారు కంటే తక్కువేం కాదు’  అని ట్వీట్‌ చేశాడు ఆర్జీవీ (Ram Gopal Varma). ఆ ట్వీట్‌కు వాగ్వాదం జరిగిన వీడియోను ట్యాగ్‌ చేశాడు.

విశ్వక్‌ సేన్ నటించిన ‘అశోక వనంలో అర్జున కల్యాణం’ సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ప్రమోషన్స్‌ను స్పీడప్‌ చేసింది చిత్ర యూనిట్.ఇందులో భాగంగా ఒక యువకుడితో కలిసి విశ్వక్‌సేన్‌ రోడ్డుపై ప్రాంక్ వీడియో చేశాడు. అది కాస్తా రచ్చ రచ్చ అయ్యింది. రోడ్డుపై ప్రాంక్‌ వీడియో చేయడంపై పలువురు విశ్వక్‌పై మండిపడుతున్నారు. కొందరైతే.. ప్రమోషన్స్‌ కోసం ఇంతకు దిగజారుతారా? అని విమర్శలు కూడా చేస్తున్నారు. అది కాకుండా ఇప్పుడు విశ్వక్‌కు మరో తలనొప్పి కూడా వచ్చి పడింది.

 

తన ప్రాంక్ వీడియో కోసం ఓ యువకుడిని ఎంపిక చేశాడు విశ్వక్‌. కొత్త సినిమా రిలీజ్‌ అయ్యే సమయంలో ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ వద్ద రివ్యూలు చెప్పే యువకుడే ఈ ప్రాంక్ వీడియోలో ముఖ్య పాత్రధారి. ‘విశ్వక్‌సేన్‌ తన కారులో ఫిలింనగర్‌‌ రోడ్డులో వెళుతుంటాడు, సరిగ్గా అదే సమయంలో ఆ యువకుడు రోడ్డుపై కారుకు అడ్డంగా పడుకుని హల్‌చల్‌ చేశాడు.

విశ్వక్‌సేన్ కారులోంచి దిగి అసలేం జరిగిందని యువకుడిని అడుగుతాడు. అప్పుడు ఆ యువకుడు "అల్లం అర్జున్‌ కుమార్ (అశోక వనంలో అర్జున కల్యాణం సినిమాలో హీరో విశ్వక్‌సేన్‌ పేరు) కు33 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాలేదు సార్‌‌. అది నేను తట్టుకోలేకపోతున్నాను. పెట్రోల్‌ పోసుకుని సూసైడ్‌ చేసుకుంటానంటూ" హడావుడి చేశాడు. ఇదంతా నిజంగానే జరుగుతోందా అన్నట్టు విశ్వక్‌ కూడా బిహేవ్ చేశాడు. 

దీంతో కాసేపు నడిరోడ్డుపై  వీరిద్దరి  మధ్య హంగామా నడిచింది. ట్రాఫిక్ ఆగిపోవడంతో అక్కడి జనాలు కూడా ఇబ్బంది పడ్డారు. ఈ వీడియోని సోషల్ మీడియా, యూట్యూబ్‌లలో ప్రమోట్ చేయగా ఇది చూసిన వాళ్లంతా సినిమా ప్రమోషన్స్‌ కోసం మరీ ఇంతగా దిగజారాలా? ప్రమోషన్స్ పేరుతో పబ్లిక్‌ ప్లేస్‌లో ప్రాంక్‌ వీడియోలు చేస్తూ  ఈ న్యూసెన్స్‌ ఏంటి? అని విశ్వక్‌సేన్‌ పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదే అంశంపై ఒక న్యూస్ చానల్‌లో జరిగిన కార్యక్రమంలో యాంకర్‌‌కు విశ్వక్‌సేన్‌కు మధ్య వాగ్వివాదం జరిగింది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!