లెజండరీ హీరో బాలకృష్ణ (Balakrishna) బర్త్ డే స్పెషల్ స్టోరి - సినీ, రాజకీయ జీవిత విశేషాలు
నందమూరి తారక రామారావు తనయుడిగా బాలకృష్ణ (Balakrishna ) టాలీవుడ్‌లో నట సింహంగా పేరు తెచ్చుకున్నారు. మాస్, క్లాస్ చిత్రాలతో అభిమానులను మెప్పిస్తున్నారు. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు. లెజండరీ హీరో బాలకృష్ణ 61వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. బాలకృష్ణలో స్పెషల్ క్వాలిటీస్ ఎంతో మందిని ఆకర్షిస్తాయి. టాలీవుడ్ ఎంతో అభిమానంగా పిలుచుకునే బాలయ్య బర్త్ డే సందర్భంగా పింక్ విల్లా స్పెషల్ స్టోరి.
తమిళనాడులో తెలుగు ఇండస్ట్రీ ఉండే సమయంలో సీనియన్ ఎన్టీఆర్ చెన్నైలోనే ఉండేవారు. బాలకృష్ణ (Balakrishna) చెన్నైలోనే పుట్టారు. ఆ తర్వాత కొద్ది రోజులకు బాలకృష్ణ హైదరాబాద్ వచ్చారు. తన డిగ్రీని నిజాం కాలేజీలో పూర్తి చేశారు బాలకృష్ణ. 22 ఏళ్ల వయసులోనే బాలకృష్ణకు వసుంధర దేవీతో పెద్దలు పెళ్లి జరిపించారు. బాలకృష్ణ, వసుంధర దేవీకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్వినీలు. కుమారుడు మోక్షజ్ఞ.
బాలకృష్ణ 14 ఏళ్ల వయసులోనే సినిమా రంగంలోకి వచ్చారు. నందమూరి బాలకృష్ణ సాహసమే జీవితం సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. బాలకృష్ణ జానపద, పౌరాణిక, దేశభక్తి, , సాంఘిక చిత్రాలతో పాటు ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి మెప్పించారు.
Balakrishna: తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన 12 సినిమాల్లో బాలకృష్ణ నటించారు. అన్నదమ్ముల అనుబంధం సినిమలో తండ్రి ఎన్టీఆర్‌కు తమ్ముడిగా బాలకృష్ణ నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
మంగమ్మగారి మనువడు చిత్రంలో బాలకృష్ణ పల్లెటూరి అబ్బాయిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ సినిమాలో సుహాసినీతో దంచవే మేనత్త కూతురా అంటూ వేసిన స్టెప్పులు ఇప్పటికీ హిట్‌గానే ఆ పాట మోత మోగుతుంది.
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ ఎక్కువ సినిమాలు నటించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో దాదాపు 13 చిత్రాలు విడుదల అయి హిట్ సాధించాయి.
Balakrishna: 1987వ సంవత్సరం బాలకృష్ణకు చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే బాలకృష్ణ నటించిన 8 సినిమాలు ఈ సంవత్సరంలోనే రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాయి.
విజయశాంతి హీరోయిన్‌గా బాలకృష్ణ హీరోగా వచ్చే సినిమాలు ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించేవారు. బాలకృష్ణ, విజయశాంతి హీరో హీరోయిన్లుగా 17 సినిమాలు విడుదల అయ్యాయి. బాలకృష్ణతో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ విజయశాంతినే.
Balakrishna:డబుల్ రోల్‌లో ఎక్కువ సినిమాలు చేశారు బాలకృష్ణ. అధినాయకుడు అనే సినిమాలు మూడు పాత్రల్లో నటించారు. పైసా వసూల్ చిత్రంలో బాలకృష్ణ మొదటి సారి ఓ పాట పాడారు. ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
బాలకృష్ణ సినిమాలో స్పెషల్ సీన్స్ ఉంటాయి. కళ్లతో రైళ్లు ఆగిపోవడం.. ఫైటింగ్ సీన్లలో కార్లు ఎగిరెగిరి పడటం.. కత్తులతో వేటాడే సీన్స్ ఉంటాయి. దర్శకులు బాలకృష్ణ కోసం ప్రత్యేకంగా సీన్లను తీస్తుంటారు. కంటి చూపుతో రైలు ఆగే సీన్ బాలకృష్ణ చేస్తేనే వెండితెరపై హిట్ అవుతాయిని మేకర్స్ చెప్పారట. మేకర్స్ చెప్పినట్టుగానే బాలకృష్ణ సీన్ హిట్ అయిందంట.
Balakrishna: బాలకృష్ణ సింహం పేరు కలిసొచ్చే టైటిల్లతో ఆ మధ్య కాలంలో సినిమాలు తీశారు. బొబ్బిలి సింహం, సమర సింహా రెడ్డి, నరసింహా నాయుడు, సీమ సింహం, లక్ష్మీ నరసింహా, సింహా, జై సింహా సినిమాలను చేశారు. దాదాపు 8 సినిమాలు సింహం పేరు వచ్చేలా నటించారు బాలకృష్ణ. బాలకృష్ణ 126 మంది హీరోయిన్లతో నటించారు. హీరోయిన్లతో అదిరిపోయే స్టెప్పులు వేసి ప్రేక్షకులను అలరించారు.
Balakrishna: తండ్రి ఎన్టీఆర్ బయోపిక్స్‌లో బాలకృష్ణ నటించారు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లో తండ్రి పాత్రలో నటించారు. తండ్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమాలో నటించిన హీరో బాలకృష్ణనే.
బాలకృష్ణ తల్లి బసవ తారకం కేన్సర్ వ్యాధి కారణంగా కన్నుమూశారు. దీంతో ఎన్టీఆర్ తన భార్య పేరుతో బసవ తారకం కేన్సర్ హాస్పటల్‌ను కట్టించారు. బసవ తారకం కేన్సర్ హాస్పటల్‌కు చైర్మన్‌గా బాలకృష్ణ కేన్సర్ రోగులకు సహాయం అందిస్తున్నారు.
నటనతో పాటు రాజకీయాల్లోనూ కొనసాగుతున్నారు బాలకృష్ణ. ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం నియోజకవర్గానికి టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రజా సేవ చేస్తున్నారు.