ఆహా ఓటీటీలో 'చెఫ్ మంత్రా' (Chef Mantra) సీజన్ 2 ఫుడ్ షో.. హోస్ట్ గా అలరించనున్న మంచు లక్ష్మీ (Manchu Lakshmi)

Updated on Sep 23, 2022 04:44 PM IST
ఆహా ఓటీటీ (Aha) వేదికగా 'చెఫ్ మంత్రా' (Chef Mantra) అనే ఫుడ్ షోకి మంచు లక్ష్మీ (Manchu Lakshmi) హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు.
ఆహా ఓటీటీ (Aha) వేదికగా 'చెఫ్ మంత్రా' (Chef Mantra) అనే ఫుడ్ షోకి మంచు లక్ష్మీ (Manchu Lakshmi) హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు.

మంచు మోహన్ బాబు (Mohan Babu) వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ మల్టీ టాలెంటెడ్ నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. తన సినిమాలు, షోలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తోంది. ఈసారి మంచు లక్ష్మీ ఓటిటిలో ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అయింది. 

ఆహా ఓటీటీ (Aha OTT) వేదికగా 'చెఫ్ మంత్రా' (Chef Mantra) అనే ఫుడ్ షో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ షో సీజన్ 2కి మంచు లక్ష్మీ హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. 8 ఎపిసోడ్స్ కలిగిన ఈ షో ను ముందుండి నడిపించడానికి మంచు లక్ష్మీ వచ్చేస్తోంది. 

సెలబ్రిటీస్ జీవితం ఎలా ఉంటుంది, వారు ఏం చేస్తారు, ఏం తింటారని తెలుసుకోవడానికి అందరికి ఎంతో ఆసక్తిగా ఉంటుంది. వారు అభిమానించే స్టార్సే గరిట పట్టి వంట చేస్తే? చూడముచ్చటగా ఉంటుంది కదా? అందుకే మన 'ఆహా' చెఫ్ మంత్రా సీజన్ 2తో (Chef Mantra Season 2) అందరినీ మరోసారి అలరించడానికి సెప్టెంబర్ 30 నుండి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రసారం అవుతుంది.

తాజాగా విడుదల చేసిన 'చెఫ్ మంత్రా' సీజన్ 2 ప్రోమోలో (Promo) మంచు లక్ష్మీ గ్రీన్ కలర్ అవుట్ ఫిట్ లో మెరిసిపోతోంది. ఆమె లుక్ కంప్లీట్ డిఫెరెంట్ గా ఉంది. మంచు లక్ష్మిని ఇలా చూస్తూ నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. 

ఈ షో లాంచ్ సందర్భంగా లక్ష్మీ మంచు (Manchu Lakshmi) మాట్లాడుతూ.. "మంచు ఫ్యామిలీలో అందరం కూడా భోజనప్రియులమే. ఎన్నో విషయాలు లంచ్ లేదా డిన్నర్ టేబుల్ మీద అందరు కలిసి ఉన్నపుడు మాట్లాడుతారు. మంచి ఫుడ్ ఉంటే ఆరోజు చాలా బాగా గడిచిపోతుంది. అలాంటి ఒక ఫుడ్ షో ని నేను హోస్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అందరూ ఈ షోను ఇష్టపడతారని ఆశిస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ షో సెప్టెంబర్ 30 నుండి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తప్పక చూడండి" అని పేర్కొంది.

Read More: 'ఆహా'లో మరో సరికొత్త రియాలిటీ షో 'డ్యాన్స్ ఐకాన్' (Dance Ikon).. న్యాయనిర్ణేతగా రమ్యకృష్ణ (Ramya Krishnan) ఎంట్రీ..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!