'టూ లెజెండ్స్ వన్ సెన్సెషనల్ ఎపిసోడ్'.. ‘అన్‌స్టాప‌బుల్ సీజన్ 2’ (Unstoppable With NBK) తొలి గెస్ట్ ఎవరంటే?

Updated on Oct 10, 2022 04:13 PM IST
బాలయ్య షోకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రానున్నారని అధికారికంగా ప్రకటించేసింది.
బాలయ్య షోకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రానున్నారని అధికారికంగా ప్రకటించేసింది.

ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా'(Aha) లో ప్రసారమయ్యే ‘అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే’ (Unstoppable With NBK)... టాక్ షో స్పెషాలిటీ ఏంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) ఈ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచారు. 

‘అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే’ (Unstoppable With NBK) టాక్ షో ఆయన అభిమానులకే కాకుండా.. తెలుగు ప్రేక్షకులందరికీ తెగ నచ్చేసింది. సినీ స్టార్ సెలబ్రిటీలని తీసుకొచ్చి వాళ్లందరితో ఈ షోని సరదగా తనదైన శైలిలో నడిపించారు బాలకృష్ణ. ఈ షో ద్వారా బాలకృష్ణలోని మరో కోణం ప్రేక్షకులకు తెలిసొచ్చింది.

ఈ నేపథ్యంలో బాల‌య్య 'అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2' (Unstoppable With NBK)తో మ‌రోసారి అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన టీజ‌ర్‌ను కూడా రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ‘అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే’ సీజ‌న్ 2 ట్రైలర్‌ను ఆదివారం 'ఆహా' విడుద‌ల చేసింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ షో నుంచి మరో బిగ్‌ అప్డేట్‌ విడుదల చేసింది 'ఆహా' టీమ్. బాలయ్య షోకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రానున్నారని అధికారికంగా ప్రకటించేసింది. అంతేకాదు.. చంద్రబాబుతోనే తమ సెకండ్‌ సీజన్‌ సెకండ్‌ షో ప్రారంభం అవుతున్నట్లు కూడా స్ప ష్టం చేసింది. అంటే.. ఈ నెల 14న బాలయ్య-చంద్రబాబు షో స్ట్రీమింగ్‌ కానుంది. 

ఈ మేరకు ఓ పోస్టర్‌ ను (Unstoppable With NBK Season2 Poster) కూడా విడుదల చేసింది 'ఆహా' టీమ్. బాలయ్య, చంద్రబాబు కలిసి ఉన్న పోస్టర్ రిలీజ్ చేస్తూ.. "టూ లెజెండ్స్ వన్ సెన్సెషనల్ ఎపిసోడ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఫస్ట్ ఎపిసోడ్ పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో ఈ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Read More: 'అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2' (Unstoppable With NBK) ట్రైలర్ వచ్చేసింది... ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో బాలయ్య!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!