ప్రియమణి(Priyamani) ప్రధాన పాత్రలో "డాక్టర్56"(Dr. 56).. 'ఐదేళ్లలో 2163 మంది' అంటూ ఆసక్తికరంగా మోషన్ పోస్టర్!

Updated on Nov 14, 2022 06:19 PM IST
 "డాక్టర్ 56" మోషన్ పోస్టర్‌ను (Doctor 56 Motion Poster) రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులోనే సినిమా కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు.
"డాక్టర్ 56" మోషన్ పోస్టర్‌ను (Doctor 56 Motion Poster) రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులోనే సినిమా కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు.

నేషనల్ అవార్డు విన్నర్ ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం "డాక్టర్ 56" (Doctor 56). ఏఎన్‌ బాలాజీ సమర్పణలో శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. రాజేష్ ఆనందలీల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది వరకే ఈ బ్యానర్ మీద మంచి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రభుదేవా ఫ్లాష్ బ్యాక్, వర ఐపీఎస్, ఛేజింగ్ వంటి చిత్రాలు కూడా ఈ బ్యానర్ మీద రెడీ అవుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాలన్నీ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాయి.

"డాక్టర్ 56" చిత్రం తెలుగు, తమిళం, మలయాళం భాషలలో కూడా విడుదల కానుంది. ఈ సినిమాకు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) వచ్చి ప్రమోషన్ చేయడంతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 9న విడుదల చేయబోతోన్నట్టు మేకర్స్ ప్రకటించారు.

దీంతో పాటుగా "డాక్టర్ 56" మోషన్ పోస్టర్‌ను (Doctor 56 Motion Poster) రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులోనే సినిమా కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు. ఇండియాలో ఐదేళ్లలో 2163 మంది అంటూ అలా సస్పెన్స్‌గా వదిలేశారు. మోషన్ పోస్టర్లో చూపించిన ఈ సంఖ్య, ప్రియమణి గన్నుపట్టుకున్న తీరు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి.

"డాక్టర్ 56" (Doctor 56) సినిమాకు విక్రమ్ మోర్ ఫైట్ మాస్టర్‌గా, రాకేష్ సి తిలక్ కెమెరామెన్‌గా, విశ్వ ఎన్ ఎమ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. మాటలు భార్గవ్ రామ్ అందిస్తుండగా, పాటలకు సాహిత్యాన్ని చల్లా భాగ్యలక్ష్మీ, జె లక్ష్మణ్ అందించారు. నోబిన్ పాల్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణితో (Priyamani) పాటు ఇతర ముఖ్య పాత్రల్లో ప్రవీణ్, దీపక్ రాజ్‌శెట్టి, రమేష్‌ భట్, యతిరాజ్, వీణా పొన్నప్ప, మంజునాథ్ హెగ్డే, స్వాతి తదితరులు నటిస్తున్నారు.

Read More: జబర్దస్త్ కామెడీ షోకు (Jabardasth) మరో హాట్ యాంకర్ సౌమ్యా రావు.. రష్మీ గౌతమ్ (Rashmi Gautham) స్పందన ఇదే!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!