జబర్దస్త్ కామెడీ షోకు (Jabardasth) మరో హాట్ యాంకర్ సౌమ్యా రావు.. రష్మీ గౌతమ్ (Rashmi Gautham) స్పందన ఇదే!

Updated on Nov 10, 2022 03:33 PM IST
సౌమ్యా రావుపై (Sowmya Rao) తనకు ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్ లేదని, తను రావడాన్ని స్వాగతిస్తున్నానని రష్మీ గౌతమ్ (Rashmi Gautham) వెల్లడించింది.
సౌమ్యా రావుపై (Sowmya Rao) తనకు ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్ లేదని, తను రావడాన్ని స్వాగతిస్తున్నానని రష్మీ గౌతమ్ (Rashmi Gautham) వెల్లడించింది.

బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో (Jabardasth Comedy Show) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మందిని అలరిస్తున్న జబర్దస్త్ షోకి సౌమ్య రావు (Sowmya Rao) అనే కొత్త యాంకర్ వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో జబర్దస్త్ కి అనసూయ, ఎక్స్ ట్రా జబర్దస్త్ కి రష్మీ గౌతమ్ యాంకర్స్ గా ఉండగా.. అనసూయ సినిమాల్లో బిజీ అవ్వడం వల్ల కొన్ని రోజుల క్రితం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసింది.

దీంతో అప్పటి నుంచి రెండు షోలకు రష్మీ (Anchor Rashmi) యాంకర్ గా చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో సడెన్ గా షోలో సౌమ్యా రావు కనిపించడంతో రష్మీని తీసేశారని, ఈ కామెడీ షో నుంచి రష్మీ ఔట్ అంటూ రకరకాల పుకార్లు వచ్చాయి. అంతేకాదు ఈ విషయంలో రష్మీ సీరియస్ గా ఉందంటూ వదంతులు కూడా వినిపించాయి. తాజాగా దీనిపై రష్మీ స్పష్టతనిచ్చింది.

సౌమ్యా రావుపై (Sowmya Rao) తనకు ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్ లేదని, తను రావడాన్ని స్వాగతిస్తున్నానని రష్మీ వెల్లడించింది. తను వస్తుందని తనకు ముందుగానే మల్లెమాల వారు చెప్పారని తెలిపింది. అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్ళినప్పుడే తనకు కొన్ని రోజులే జబర్దస్త్ షో చేయమని చెప్పారని, ఆ తర్వాత వేరే యాంకర్ వస్తుందని ముందుగానే చెప్పారని వెల్లడించింది.

మల్లెమాల సంస్థ నాకు హోమ్ ప్రొడక్షన్ లాంటిది అని చెప్పింది రష్మి గౌతమ్ (Rashmi Gautham). అయితే ఒకవేళ సౌమ్య వేరే షోస్ తో బిజీగా ఉండి జబర్దస్త్ షోలు స్కిప్ చేసినా, క్విట్ చేసినా మళ్లీ వెళ్తానని, హ్యాపీగా షో చేసుకుంటానని రష్మీ పేర్కొంది. ఈ విషయంలో సౌమ్య యాంకర్ కావడం వల్ల తనకు ఇబ్బందేం లేదని, మల్లెమాల సంస్థ ఎప్పుడు పిలిచినా తాను సిద్దమేనని రష్మీ చెప్పుకొచ్చింది. 

యాంకర్ సౌమ్యా రావు (Sowmya Rao) ఓ కన్నడ అమ్మాయి.ఈ అమ్మాయి ఈటీవీలో వచ్చే 'శ్రీమంతుడు' సీరియల్ తో పాపులర్ అయింది. తాజాగా కామెడీ షోలో జబర్దస్త్ కొత్త యాంకర్ గా రెమ్యూనరేషన్ ఎంత అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం సౌమ్యరావుకు దాదాపుగా రూ.60వేలకు పైగానే రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. ఆమె పర్ఫామెన్స్,మాట, ఆకట్టుకునే తీరును బట్టి ఇంకా పెంచుతామని హామీ కూడా ఇచ్చారట నిర్మాతలు.

Read More: Aanasuya bharadwaj: జబర్దస్త్ (Jabardasth) కామెడీ షోకు హాట్ యాంకర్ అనసూయ గుడ్ బై.. కొత్త యాంకర్ ఎవరంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!