టర్కీ టూర్ లో తెగ ఎంజాయ్ చేస్తున్న మెగాడాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela)... ఆమె వీపుపై టాటూ అర్థమేంటో?

Updated on Nov 11, 2022 12:27 PM IST
నిహారిక వీపుపై 'NK' అనే అక్షరంతో పాటు పక్షి సింబల్ ఇంకా.. చాలా కొత్త రకమైన డిజైన్ కనిపిస్తూ ఉంది.
నిహారిక వీపుపై 'NK' అనే అక్షరంతో పాటు పక్షి సింబల్ ఇంకా.. చాలా కొత్త రకమైన డిజైన్ కనిపిస్తూ ఉంది.

మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. ఈమెకు సోషల్ మీడియాలో 2 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో తన డైలీ లైఫ్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసి ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది. నిహారికకు వెకేషన్స్ అంటే మహా సరదా. సమయం దొరికితే చాలు బ్యాగు సర్దుసుకుని వెళ్లి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంటుంది.

మెగా కాంపౌండ్ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక (Niharika Konidela) అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత వెబ్ సిరీస్ ఇంకా పలు రకాలుగా టాలెంట్ నిరూపించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. వెబ్ సిరీస్ లో నటించడం మాత్రమే కాదు నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. ఆమె ఇప్పటి వరకు తెలుగులో మూడు చిత్రాలు చేశారు. 'ఒక మనసు', 'హ్యాపీ వెడ్డింగ్',‘సూర్యకాంతం’ ఈ మూడు చిత్రాలు అనుకున్నంతగా అలరించలేదు.

 నిహారిక కొణిదెల (Niharika Konidela) ప్రస్తుతం తన లేటెస్ట్ క్లిక్స్ తో నెటిజన్స్ ను ఆకట్టుకుంది. టర్కీ టూర్ లో ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసింది.

ఈ దిశగా కెరియర్ కొనసాగుతూ ఉండగా గత ఏడాది నిహారిక పెళ్లి చేసుకోవడం తెలిసిందే. చైతన్య జొన్నలగడ్డతో మ్యారేజ్ తర్వాత నటనకు దాదాపు గుడ్ బై చెప్పినట్టు  ఆ మధ్య ఒక టీవీలో ప్రసారమయ్యే  షోలో వ్యాఖ్యానించింది. అంతేకాదు తన భర్తకు తాను సినిమాల్లో నటించడమంటే ఇష్టం లేదు అంటూ కుండ బద్దలు కొట్టింది. ప్రస్తుతం ఈ భామ కేవలం నిర్మాతగా పలు వెబ్ సిరీస్‌లు నిర్మిస్తోంది. 

ఇదిలా ఉంటే.. నిహారిక కొణిదెల ప్రస్తుతం తన లేటెస్ట్ క్లిక్స్ తో నెటిజన్స్ ను అట్రాక్ట్ చేసింది. టర్కీ టూర్ లో నిహారిక ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసింది. ఈ క్రమంలో ఎన్నడూ లేనిది ఈ మధ్య బికినీలో కనిపించి అందరకీ షాకిచ్చింది నిహారిక. తాజాగా ఆమె మరోసారి బికినీ ఫొటోలను (Niharika In Bikini) పంచుకుంది. టర్కీ టూర్ లో సేద తీరిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో నీహారిక వీపుపై ఉన్న టాటూ స్పష్టంగా కనిపించింది.

నిహారిక వీపుపై 'NK' అనే అక్షరంతో పాటు పక్షి సింబల్ ఇంకా.. చాలా కొత్త రకమైన డిజైన్ కనిపిస్తూ ఉంది. దీంతో డిజైన్ ఏంటో అన్నది కనిపెట్టడానికి ఫోటో చూసినవాళ్లు తెగ తంటాలు పడుతున్నారు. నీళ్లలో సేద తీరుతూ జలకాలాటలాడుతూ నిహారిక (Niharika Konidela) ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలపై ఒకపక్క ఫుల్ బికినీ ఫోటోలు పెట్టాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది మెగా ఫ్యామిలీ పరువు తీస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు.

Read More: నిహారిక కొణిదెల‌ (Niharika Konidela): భ‌ర్త‌తో విభేదాలపై నిహారిక క్లారిటీ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!