Nani (నాని) : బిగ్ బితో ఓ అభిమాని గ‌డిపిన క్ష‌ణాలు.. వైర‌ల్‌గా మారిన ఫోటోలు

Updated on Jun 29, 2022 12:05 PM IST
నాని (Nani) ఆనందానికి కార‌ణం బాలీవుడ్ లెజండ్ స్టార్, బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌ను క‌ల‌వ‌డ‌మే.
నాని (Nani) ఆనందానికి కార‌ణం బాలీవుడ్ లెజండ్ స్టార్, బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌ను క‌ల‌వ‌డ‌మే.

టాలీవుడ్‌లో నాని (Nani) త‌న న‌ట‌న‌తో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచుతున్నారు. ప్ర‌స్తుతం నాని ఫుల్ హ్యాపీగా ఉన్నారు. నాని ఆనందానికి కార‌ణం బాలీవుడ్ లెజండ్ స్టార్, బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌ను క‌ల‌వ‌డ‌మే. అమితాబ్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి నాని దిగిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 

అశ్వినీ ద‌త్ కొత్త ఆఫీసులో అమితాబ్

నిర్మాత అశ్వినీ ద‌త్ హైద‌రాబాద్‌లో వైజ‌యంతీ ఫిలిమ్స్ కొత్త ఆఫీసును ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్రభాస్, ప్రశాంత్ నీల్, దుల్కర్ సల్మాన్, రాఘవేంద్రరావు, నాని, అమితాబ్ బ‌చ్చ‌న్ , నాగ అశ్విన్ హాజ‌ర‌య్యారు. ప్రభాస్ 'ప్రాజెక్టు కే' చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్వినీ దత్ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 'ప్రాజెక్ట్ కె'లో అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషించ‌నున్నారు. అశ్వినీ ద‌త్ కొత్త ఆఫీసులో బడా హీరోలు, స్టార్ డైరెక్ట‌ర్లు సంద‌డి చేశారు. 

 

అమితాబ్‌ తో నాని

అశ్వినీ ద‌త్ ఆఫీస్‌కు వ‌చ్చిన అమితాబ్ బ‌చ్చ‌న్ (Amitabh Bachchan) తో హీరో నాని ఫోటో దిగారు. బిగ్ బీతో క‌లిసి నాని కాసేపు ముచ్చ‌టించారు. లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్‌తో క‌లిసి దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోల‌తో పాటు 'చోటే మియా.. బడే మియా' అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చారు.

ఇటీవలే నాని (Nani) న‌టించిన 'అంటే.. సుంద‌రానికీ' చిత్రం ఓ మాదిరి కలెక్షన్లనే రాబట్టింది . ఈ చిత్రాన్ని దర్శకుడు వివేక్ ఆత్రేయ రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కించారు. నానికి జోడిగా ఈ చిత్రంలో న‌జ్రియా న‌టించారు. ప్ర‌స్తుతం నాని ద‌స‌రా సినిమాలో న‌టిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'ద‌స‌రా'లో నాని స‌ర‌స‌న  కీర్తి సురేష్ న‌టిస్తున్నారు. 'దసరా' కానుకగా నాని చిత్రం విడుద‌ల కానుంది. 

Read More: Telugu Movies: బాలీవుడ్‌లో తెలుగోడి స‌త్తా .. హిందీలో అత్య‌ధిక వ‌సూళ్లును సాధించిన‌ టాప్ 10 తెలుగు సినిమాలు !

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!