'అన్‌ స్టాపబుల్ సీజన్ 2' (Unstoppable With NBK Season2) ప్రోమో వచ్చేసింది.. నారా-నందమూరి వారి అనుబంధం అదుర్స్!

Updated on Oct 13, 2022 12:49 PM IST
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యాఖ్యాతగా 'అన్‌ స్టాపబుల్ సీజన్ 2' (Unstoppable With NBK Season2) ఈవారం నుంచే ప్రారంభం కాబోతోంది.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యాఖ్యాతగా 'అన్‌ స్టాపబుల్ సీజన్ 2' (Unstoppable With NBK Season2) ఈవారం నుంచే ప్రారంభం కాబోతోంది.

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యాఖ్యాతగా ‘ఆహా’లో మొదలైన ‘అన్‌ స్టాపబుల్‌ విత్ ఎన్బీకే’ (Unstoppable With NBK) టాక్‌ షో బెస్ట్‌గా పేరు తెచ్చుకుంది. ఆయన తనదైన స్టైల్ లో ఈ షోను నడిపిస్తూ ఇండియాలోనే నెంబర్ వన్ గా నిలిపారు. తనదైన మాటలతో, పంచ్ లతో వచ్చిన గెస్ట్ లను తికమకపెడుతూ ఎంతో సరదాగా సాగింది అన్ స్టాపబుల్ సీజన్ వన్. దీంతో ఈ షో రెండో సీజన్ కు రెడీ అయింది. 

'అన్‌ స్టాపబుల్ సీజన్ 2' (Unstoppable With NBK Season2) ఈ వారం నుంచే ప్రారంభం కాబోతోంది. 'ఆహా' ఓటీటీ లో ఈ శుక్రవారం స్ట్రీమింగ్ కాబోతున్న మొదటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. తొలి ఎపిసోడ్‌కు ముఖ్య అతిథులుగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ తో కలిసి వచ్చారు. 

ఇక ఈ ప్రోమోలో చంద్రబాబును (Chandrababu Naidu) అందరికీ బాబుగారు, తనకు బావగారు అంటూ బాలయ్య ఆహ్వానించిన తీరు భలేగా ఉండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాబుతో కలిసి బాలయ్య చేసిన సందడి మామూలుగా ఉండబోదని ఈ ప్రోమో వీడియో చూస్తే అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడులోని మరో కోణాన్ని కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు బాలయ్య తీసుకొచ్చినట్లుగా అనిపిస్తోంది.

ఈ ప్రోమోలో బాలయ్య మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పండి అని చంద్రబాబు ను అడగ్గా నేను రాజశేఖర్ రెడ్డి కలిసి బాగా తిరిగాం అని సమాధానం ఇచ్చారు చంద్రబాబు. అలాగే కొన్ని విషయాల్లో బాలయ్యపైనే పంచులు కూడా వేశారు చంద్రబాబు. ఇక, లోకేష్ (Nara Lokesh).. మామతో కలిసి సందడి చేయడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే బాలయ్య  మా చెల్లిని ఏమని పిలుస్తారు బావా మీరు అని అడగ్గా 'భూ' అని పిలుస్తా అని అన్నారు చంద్రబాబు. 

అలాగే మా చెల్లికి మా అందరి ముందు 'ఐ లవ్ యూ' చెప్పాలి అని బాలయ్య అడిగితే చంద్రబాబు (Chandrababu Naidu) .. ఆయన భార్యకు ఫోన్ చేసి మీ బాలకృష్ణ గారి చేతిలో ఇరుక్కుపోయా అంటూ నవ్వులు పూయించారు. ఇక బాలకృష్ణ (Nandamuri Balakrishna) అల్లుడు నారా లోకేశ్ హోస్ట్‌గా మారి తన తండ్రి, మామలను పలు ఆసక్తికర ప్రశ్నలు అడగ్గా.. తండ్రీ కొడుకులు కలిసి తన సంసారంలో నిప్పులు పోస్తున్నారు అంటూ బాలయ్య చేసిన కామెంట్ నవ్వులను పూయించింది.

Read More: 'టూ లెజెండ్స్ వన్ సెన్సెషనల్ ఎపిసోడ్'.. ‘అన్‌స్టాప‌బుల్ సీజన్ 2’ (Unstoppable With NBK) తొలి గెస్ట్ ఎవరంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!