రెమ్యూనరేషన్ పెంచేసిన నందమూరి బాలకృష్ణ (BalaKrishna)!.. అనిల్‌ రావిపూడి సినిమాకి ఎంత తీసుకుంటున్నారంటే?

Updated on Oct 20, 2022 09:48 PM IST
 అఖండ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ (BalaKrishna) గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.
అఖండ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ (BalaKrishna) గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.

అఖండ సక్సెస్ తర్వాత నందమూరి బాలకృష్ణ (Balakrishna) రెమ్యూనరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది. ఆయన హోస్ట్‌ చేసిన అన్‌స్టాపబుల్ టాక్ షో దేశంలో అత్యుత్తమ రేటింగ్ సాధించిన షోలలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించిన అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌, విడుదల తేదీని శనివారం ప్రకటించనున్నారు మేకర్స్.

బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా నాన్-థియేట్రికల్, థియేట్రికల్ రైట్స్‌ రికార్డు ధరకు అమ్ముడయ్యాయి. ఈ క్రమంలో బాలయ్య తన రెమ్యూనరేషన్ పెంచేసినట్లు సమాచారం. ఈ సినిమా కోసం బాలకృష్ణ రూ.18 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.

 అఖండ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ (BalaKrishna) గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.

నిర్మాతలు కూడా ఓకే..

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించనున్నారు బాలకృష్ణ. ఈ సినిమాకు రూ.25 కోట్లు రెమ్యూనరేషన్‌గా కోట్ చేశారని సమాచారం. అయితే దీనికి నిర్మాతలు కూడా ఆమోదం తెలిపారని తెలుస్తోంది. ఇదే నిజమైతే బాలయ్య కెరీర్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే సినిమాగా నిలుస్తుంది.

మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ నవంబర్‌లో ప్రారంభం కానుంది. 2023 వేసవిలో సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇంకా టైటిల్‌ ఖరారు కాని ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కు ఎస్‌ఎస్‌ థమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ (Balakrishna) అఖండ సినిమా సూపర్‌‌హిట్‌ కావడంలో థమన్ అందించిన మ్యూజిక్‌ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

Read More : టర్కీలో హోటల్‌లో బాలకృష్ణ (BalaKrishna).. సామాన్యుడితో సరదాగా ముచ్చటించిన బాలయ్య

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!