బాలకృష్ణ (Balakrishna) అభిమానులా మజాకా? కర్నూలులో రచ్చ మామూలుగా లేదు.. వైరల్ అవుతున్న వీడియో
‘అఖండ’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు నందమూరి బాలకృష్ణ (Balakrishna). అదే జోష్‌తో తన తర్వాత సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో పొలిటికల్ టచ్ ఉన్న మాస్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు.
‘క్రాక్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపీచంద్ మలినేని, బాలకృష్ణతో చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన బాలయ్య పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్నూల్‌లో జరుగుతోంది. కాగా బాలయ్యను చూడటానికి కర్నూల్ ప్రజలు భారీ సంఖ్యలో వచ్చారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఒక ముసలావిడ కూడా బాలకృష్ణను చూడడానికి వచ్చారు. అంతేకాదు ఈలలు వేస్తూ గోల చేస్తూ బాలకృష్ణపై అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
అక్టోబర్‌లో రిలీజ్ అనుకున్నా..
ఈ సినిమాకు ‘జై బాలయ్య’, ‘అన్నగారు’ అనే రెండు టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కన్నడ యాక్టర్ దునియా విజయ్ విలన్‌గా నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు.
అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో బాలయ్య (Balakrishna)కు రెండుసార్లు కరోనా రావడం, ఆయనతో పాటుగా కొంతమంది స్టాఫ్ కూడా కరోనా బారినపడడంతో షూటింగ్ లేట్ అయ్యింది. ప్రస్తుతం కర్నూల్ షెడ్యూల్‌ను పూర్తి చేయాలని ప్లాన్ చేశారట మేకర్స్.
Read More : సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ మాట నిలబెట్టుకున్న బాలకృష్ణ (Balakrishna).. అభిమాని కుటుంబంతో కలిసి భోజనం