HBD Balakrishna: బాలయ్య బాబు బ‌ర్త్ డే రోజు.. ఫ్యాన్స్‌కు అనుకోని సర్‌ప్రైజ్ !

Updated on Jun 10, 2022 01:41 PM IST
బాల‌కృష్ణ  (Balakrishna)  పుట్టిన‌రోజు జూన్ 10 కావ‌డంతో.. మ్రైత్రీ మూవీ మేక‌ర్స్ ఫ్యాన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది.
బాల‌కృష్ణ (Balakrishna) పుట్టిన‌రోజు జూన్ 10 కావ‌డంతో.. మ్రైత్రీ మూవీ మేక‌ర్స్ ఫ్యాన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది.

టాలీవుడ్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ న‌ట‌న ప్ర‌త్యేక‌మైంది. మాస్ యాక్ష‌న్‌తో పాటు, మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో బాల‌కృష్ణ‌ (Balakrishna). 'అఖండ' సినిమాలో బాల‌కృష్ణ‌ త‌న న‌ట విశ్వ రూపం ఏంటో మ‌రోసారి చూపారు. ప్రస్తుతం బాల‌కృష్ణ త‌న 107వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యానర్ పై త్వరలోనే ఎన్‌బీకే 107 సినిమా తెరకెక్కనుంది.

బాల‌కృష్ణ పుట్టిన‌రోజు జూన్ 10 కావ‌డంతో.. అదే రోజు మైత్రీ మూవీ మేక‌ర్స్ ఫ్యాన్స్‌కు ఓ అనుకోని సర్‌ప్రైజ్ అందించింది. ఎన్‌బీకే 107 సినిమాకి సంబంధించిన వ‌రుస అప్‌డేట్స్ ఇస్తూ, అభిమానుల‌ను ఖుషీ చేసింది. ఇదే క్రమంలో బాల‌కృష్ణ పుట్టిన రోజు ముందు రోజు ఎన్‌బీకే 107 ఫ‌స్ట్ హంట్ టీజ‌ర్ రిలీజ్ చేసింది. ఇక బాల‌కృష్ణ బ‌ర్త్ డే రోజు మ‌రో పోస్ట‌ర్ రిలీజ్ చేసింది. 

బాల‌కృష్ణ  (Balakrishna) ఎన్‌బీకే 107 షూటింగ్ దాదాపు పూర్త‌యింద‌నే టాక్ వినిపిస్తుంది.  

ఎన్‌బీకే 107 షూటింగ్ పూర్త‌యిన‌ట్టేనా..
సింహా త‌ర్వాత బాల‌కృష్ణ (Balakrishna) మంచి కథాబలం ఉన్న సినిమాల‌పై దృష్టి పెట్టారు. ప్రజలకు సందేశాన్ని ఇచ్చే సినిమాల‌ను చేస్తున్నారు.

లెజెండ్, గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ లాంటి సినిమాలు బాల‌కృష్ణ‌కు మంచి హిట్స్‌ను అందించాయి. అలాగే 'అఖండ' బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కొట్టి.. క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. ప్రస్తుతం గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ న‌టిస్తున్నారు. ఆ సినిమాకు టెంప‌ర‌రీ టైటిల్‌గా ఎన్‌బీకే 107 అని ఫిక్స్ చేశారు. ఎన్‌బీకే 107 షూటింగ్ దాదాపు పూర్త‌యింద‌నే టాక్ వినిపిస్తుంది.  

బాల‌కృష్ణ (Balakrishna) పుట్టిన రోజు కావ‌డంతో.. గోపిచంద్ మ‌లినేని ఎన్‌బీకే 107 సినిమా టైటిల్ ప్ర‌క‌టిస్తార‌ట‌.

బాల‌కృష్ణ ప‌వ‌ర్ ఫుల్ డైలాగుల‌తో కిక్
బాల‌కృష్ణ (Balakrishna) పుట్టిన రోజు సందర్భంగా..  గోపిచంద్ మ‌లినేని ఎన్‌బీకే 107 సినిమా టైటిల్‌ను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  మైత్రీ మూవీ మేక‌ర్స్ బాలకృష్ణ సినిమాను నిర్మిస్తోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజ‌ర్ యూట్యూబ్‌లో కేక పుట్టిస్తోంది. అలాగే బాల‌కృష్ణ ప‌వ‌ర్ ఫుల్ డైలాగులు పేలిపోతున్నాయి. అంతేకాకుండా, ఎన్‌బీకే 107 పోస్ట‌ర్ కూడా రిలీజ్ కావ‌డంతో, బాల‌కృష్ణ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. 
 

 

బాల‌కృష్ణ (Balakrishna)అభిమానులు త‌మ హీరో పుట్టిన‌రోజున వ‌రుస అప్‌డేట్స్ ఇవ్వ‌డంపై ఫుల్ ఖుషీ అంటున్నారు.  

టైటిల్ ఆదేనా.
మాచ‌ర్ల అనే టైటిల్‌ను బాల‌కృష్ణ‌, గోపిచంద్ మ‌లినేని కాంబో సినిమాకు ఖ‌రారు చేస్తార‌ని టాక్. బాల‌కృష్ణ బ‌ర్త్ డే రోజు సాయంత్రం ఆ టైటిల్ విడుద‌ల చేయ‌నున్నారు. బాల‌కృష్ణ అనిల్ రావిపూడితో త‌న తదుపరి సినిమా చేయ‌నున్నారు.

ఇక అనిల్ రావిపూడి కూడా బాలయ్య బాబుతో, త‌న సినిమా అప్‌డేట్స్ రిలీజ్ చేస్తార‌ని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అలాగే బాల‌కృష్ణ (Balakrishna) అభిమానులు త‌మ హీరో పుట్టిన‌రోజున వ‌రుస అప్‌డేట్స్ ఇవ్వ‌డంపై ఫుల్ ఖుషీ అంటున్నారు.  

Read More: మాస్ ఎంటర్‌‌టైనర్‌‌గా #NBK107 టీజర్ ! భయం నా బయోడేటాలోనే లేదు : బాలకృష్ణ (BalaKrishna)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!