విభిన్న గెటప్ లతో హీరో కార్తీ (Hero Karthi).. అదిరిపోయిన 'సర్దార్' (Sardar) టీజర్!

Updated on Sep 30, 2022 01:49 PM IST
హీరో కార్తీ ‘సర్దార్’ (Sardar) చిత్రం ద్వారా మరోసారి ఓ ఇంట్రెస్టింగ్‌ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
హీరో కార్తీ ‘సర్దార్’ (Sardar) చిత్రం ద్వారా మరోసారి ఓ ఇంట్రెస్టింగ్‌ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

తమిళ స్టార్ హీరో కార్తీ (Karthi) ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్’ (Sardar). ‘అభిమ‌న్యుడు’ ఫేం పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా (Raashii Khanna), రజీషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. లైలా, చంకీ పాండే కీలకపాత్రల్లో కనిపించనున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది. కాగా, ఈ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. 

హీరో కార్తీ ‘సర్దార్’ (Sardar) చిత్రం ద్వారా మరోసారి ఓ ఇంట్రెస్టింగ్‌ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా చిత్రబృందం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. దేశం కోసం పని చేసిన స్పై అదే దేశానికి వ్యతిరేకంగా ఎందుకు మారాడన్నది ఈ మూవీలో ఆసక్తికర అంశం. అయితే, టీజర్‌ మొత్తం యాక్షన్‌ సీన్స్‌ అదుర్స్‌ అనిపించేలా ఉన్నాయి.

‘సర్దార్’ చిత్రం ఇండియన్ మిలిటరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. కార్తీ (Karthi) పలు విభిన్న లుక్స్ లో కనిపించి, సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నారు. కంటెంట్ కు తగ్గట్టు మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాశ్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం టీజర్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక, ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ విడుదల చేస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. 

‘సర్దార్’ టీజర్‌లో (Sardar Teaser) ఓ స్పై కోసం ఇండియన్ ఇంటెలిజెన్స్ వారు వెతుకుతుండటం.. ఆరుగురు వ్యక్తుల్లో ఆ స్పై ఉంటాడని వారు అనుకుంటుండగా.. చివర్లో ఆ ఆరుగురు కూడా ఒకే మనిషి అనే డైలాగ్‌తో ఈ సినిమాలో కార్తీ పాత్ర గురించి రివీల్ చేసింది చిత్ర యూనిట్. ఇక పలు రకాల వేషాల్లో మనకు కార్తి ఈ టీజర్‌లో కనిపించారు. ముఖ్యంగా వృద్ధుడి గెటప్‌లో కార్తీ లుక్ కేక పుట్టిస్తోంది. మొత్తానికి టీజర్‌తోనే సర్దార్ చిత్రంపై అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పవచ్చు. 

Read More: కార్తీ నటించిన 'ఖైదీ' సీక్వెల్ పై క్లారిటీ వచ్చేసింది... ఆ సినిమా తర్వాతే 'ఖైదీ 2' (Khaidi 2) షూటింగ్ స్టార్ట్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!