Akkineni Nagachaitanya: వ‌రుస సినిమాల‌తో నాగ‌చైత‌న్య బిజీ... త‌రుణ్ భాస్క‌ర్ తో సినిమా కన్ఫర్మ్?

Updated on May 31, 2022 06:31 PM IST
త‌రుణ్ భాస్క‌ర్, నాగ‌చైత‌న్య (Director Tarun Bhaskar, Baga Chaitanya)
త‌రుణ్ భాస్క‌ర్, నాగ‌చైత‌న్య (Director Tarun Bhaskar, Baga Chaitanya)

Akkineni Nagachaitanya: అక్కినేని హీరో నాగచైతన్య వ‌రుస‌గా హిట్స్ అందుకొని మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. తాజాగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో 'థ్యాంక్యూ' సినిమా కంప్లీట్ చేశాడు చైతు. ఈ మూవీ త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది. ఇక‌, ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదల కాగా, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. జూలై 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న‌ట్లు స‌మాచారం. 

అలాగే మళ్ళీ అదే దర్శకుడితో ‘ధూత’ అనే వెబ్ సిరీస్ (Webseries) చేస్తున్నాడు. OTT ఫ్లాట్ ఫాం కోసం చైతూ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు చైతు. ఈ వెబ్ సిరీస్ లో మొదటి సారి చైతూ నెగిటివ్ షేడ్ కలిగిన పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. ఇక ఈ ప్రాజెక్టు తర్వాత తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా కూడా  చేయ‌బోతున్నాడు. ఆ ప్రాజెక్ట్ తర్వాత చేయబోయే సినిమాలు కూడా లాక్ చేసేసారని సమాచారం. 

ప్ర‌స్తుతం అందుతున్న సమాచారం మేరకు నాగచైతన్య (Akkineni Nagachaitanya)... నెక్స్ట్ పరశురాం తో ‘నాగేశ్వరరావు’ అనే  ఫ్యామిలీ ఎమోషన్స్ ప్లస్ ఫన్ ఎలిమెంట్స్ ఉండే సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ  సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ఎప్పుడో లాక్ అయింది. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టబోతున్నాడు. ఇటీవ‌ల నాగ‌చైత‌న్య‌ని సంప్ర‌దించి త‌రుణ్ భాస్క‌ర్ ఓ ఆస‌క్తిక‌ర‌మైన క‌థ వినిపించార‌ట‌. అది న‌చ్చ‌డంతో.. చైతూ కూడా వెంట‌నే ఓకే చెప్పాడ‌ని టాక్. అంతేకాదు.. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై చైతూ మేన‌మామ డి. సురేశ్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తార‌ని చెప్పుకుంటున్నారు. 

'ధూత' వెబ్ సిరీస్ టీమ్ తో నాగ‌చైతన్య‌ (Nagachatanya with Dhootha Team)

అలాగే, ఇందులో ఇప్ప‌టివ‌ర‌కు పోషించ‌ని పాత్ర‌లో నాగ‌చైత‌న్య‌ Akkineni Nagachaitanya ద‌ర్శ‌న‌మిస్తాడ‌ని బ‌జ్. త్వ‌ర‌లోనే నాగ‌చైత‌న్య-త‌రుణ్ భాస్క‌ర్ కాంబినేష‌న్ మూవీపై క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే, నాగ‌చైత‌న్య తాజా చిత్రం `థ్యాంక్యూ` జూలై 8న రిలీజ్ కానుంది. అలాగే, స్పెష‌ల్ రోల్ లో న‌టించిన హిందీ చిత్రం `లాల్ సింగ్ చ‌ద్ధా` ఆగ‌స్టు 11న తెర‌పైకి వ‌స్తోంది. 

అయితే ఇప్పుడు నాగచైతన్య Akkineni Nagachaitanya లిస్ట్ లోంచి కొందరు తప్పుకుంటన్నట్లు సమాచారం. అలా తప్పుకున్న వాళ్ళలో హీరో అల్ల‌రి న‌రేష్ తో ‘నాంది’ సినిమా తెర‌కెక్కించిన‌ దర్శకుడు విజయ్ కనక మేడల, కిషోర్ తిరుమల ఉన్నారని వినపడుతోంది. ఈ ద‌ర్శ‌కుల‌తో కూడా ఇప్పట్లో సినిమా ఉండకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. మరో ప్రక్క ఈ  గ్యాప్ లో ట్యాక్సీవాలా డైరెక్ట‌ర్ రాహుల్ సంక్రిత్యన్ కి మాత్రం చైతు చాన్స్ ఇచ్చే అవకాశం ఉందని వార్త‌లు వ‌స్తున్నాయి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!