Thank you (థాంక్యూ): సరికొత్త పాత్రలతో.. ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి రెడీ అయిన చై !

Updated on May 14, 2022 11:46 PM IST
Naga Chaitanya: అక్కినేని నాగ చైత‌న్య థాంక్యూ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఏంటంటే.. 
Naga Chaitanya: అక్కినేని నాగ చైత‌న్య థాంక్యూ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఏంటంటే.. 

ల‌వ్‌స్టోరి, బంగార్రాజు లాంటి వ‌రుస హిట్‌లతో హీరో అక్కినేని నాగచైత‌న్య (Akkineni Naga Chaitanya) దూసుకుపోతున్నారు. మ‌రో కొత్త సినిమా "థాంక్యూ"తో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు.

థాంక్యూ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ విషయానికి వస్తే, విక్ర‌మ్ కుమార్ డైరెక్ష‌న్‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. అలాగే నటి రాశీఖ‌న్నా నాగ‌చైత‌న్యకు జోడిగా న‌టించ‌నున్నారు. అవికా గోర్, మాళ‌విక న‌య్య‌ర్ కూడా ఈ చిత్రంలో  కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. 

 

అక్కినేని నాగ చైత‌న్య థాంక్యూ సినిమాకు సంబంధించిన అప్‌డేట్

నాగ‌చైత‌న్య ఈ సినిమాలో మూడు క్యారెక్ట‌ర్ల‌లో క‌నిపించ‌నున్నారు. టీనేజ్, యంగ్, మిడిల్ ఏజ్ పాత్ర‌ను చై ఈ చిత్రంలో పోషిస్తున్నారు. ఆయనకు సంబంధించిన మాస్, క్లాస్ లుక్ ఫోటోలు ఇప్ప‌టికే వైర‌ల్ అవుతున్నాయి. గ‌డ్డం పెంచేసి బాక్స‌ర్ గెట‌ప్‌లో చైత‌న్య ఢిఫెరంట్‌గా క‌నిపిస్తున్నారు. థాంక్యూ (ThankYou Movie) సినిమాలో చై కొత్త లుక్ అదిరిందంటూ అభిమానులు, ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాగ చైతన్య థాంక్యూ సినిమా జూలై 8 తేదిన థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!