సమంతతో కలిసి నేను మళ్లీ సినిమా చేస్తే, ఎలా ఉంటుందో తెలుసా ? : నాగచైతన్య (Naga Chaitanya) మనసులోని మాట ఇదే !

Updated on Aug 01, 2022 01:47 PM IST
ఏ మాయ చేసావే, మజిలీ, మనం లాంటి సినిమాలలో నాగచైతన్య (Naga Chaitanya), సమంతల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి వారి అభిమానులు బ్రహ్మరథం పట్టారు.
ఏ మాయ చేసావే, మజిలీ, మనం లాంటి సినిమాలలో నాగచైతన్య (Naga Chaitanya), సమంతల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి వారి అభిమానులు బ్రహ్మరథం పట్టారు.

టాలీవుడ్‌ సెలబ్రిటీ జంట నాగ చైతన్య (Naga Chaitanya), సమంతలు గత సంవత్సరం అక్టోబర్ నెలలో విడిపోతున్నట్లు ప్రకటించారు. అప్పుడు వారి అభిమానులు చాలా నిరుత్సాహపడ్డారు. అప్పటి నుంచి ఈ జంట నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. నాగ చైతన్య సమంతతో విడిపోయాక లవ్ స్టోరీ, థాంక్యూ లాంటి సినిమాలు చేశాడు. అలాగే 'లాల్ సింగ్ చడ్డా'లో బోడి బాలరాజు అనే పాత్ర కూడా చేశాడు. 

అలాగే సమంత కూడా 'పుష్ప' సినిమాలో 'ఊ అంటావా మామా' లాంటి ఖతర్నాక్ మాస్ మసాలా సాంగ్‌లో నటించి ఉత్తరాదిలో కూడా సత్తా చాటేసింది. ఇటీవలే నాగచైతన్య (Naga Chaitanya) ఓ ఇంటర్వ్యూలో తన మదిలోని మాటలను బయటపెట్టాడు. 'ఒకవేళ భవిష్యత్తులో ప్రొఫెషనల్‌గా సమంతతో కలిసి వర్క్ చేసే అవకాశమొస్తే ఏం చేస్తారు? ఒప్పకుంటారా?' అనే ప్రశ్నకు ఆయన నవ్వుతూ జవాబిచ్చారు.

ఏదైనా జరగవచ్చు : నాగచైతన్య

“ఇది చాలా క్రేజీ ఐడియా. కానీ ఏదైనా జరగవచ్చు. చూద్దాము." అని ఆయన జవాబిచ్చాడు. గతంలో ఇలాంటి ప్రశ్నకే చైతూ జవాబిస్తూ.. ఎందుకో తనకు సమంతతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదురుతుందని తెలిపాడు. అయితే, భవిష్యత్తులో ఈ జంట కలిసి ఓ సినిమా చేస్తే, అది కచ్చితంగా ఓ ఆసక్తికరమైన ప్రాజెక్టు అవుతుందనడంలో సందేహం లేదు. 

అన్ని విషయాలు పంచుకోవాల్సిన అవసరం లేదు 

అలాగే సమంత (Samantha) నుండి విడిపోయినప్పటి నుండి, తన వ్యక్తిగత జీవితం మీద వివిధ వెబ్ సైట్లలో వస్తున్న గాసిప్స్ గురించి కూడా నాగ చైతన్య మాట్లాడాడు.“ నా జీవితంలో నేను తీసుకున్న నిర్ణయాన్ని ఇదివరకే మీడియాకి వివిధ మాధ్యమాల తర్వాత తెలియజేశాను. సమంత కూడా తన అభిప్రాయాలను నా మాదిరిగానే మీడియాతో పంచుకుంది. అంతే తప్ప, ఇక దేని గురించి కూడా ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం నాకు లేదు" అని చైతూ అభిప్రాయపడ్డాడు. 

నాగ చైతన్య (Naga Chaitanya), సమంతల జంట ఆన్-స్క్రీన్ హిట్ పెయిర్‌గా ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారు. ఏ మాయ చేసావే, మజిలీ, మనం వంటి చిత్రాలకు వీరిద్దరూ కలిసి పనిచేశారు. అవి బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. అభిమానులు కూడా ఈ జంటను ఛాయ్‌సామ్ అని ముద్దుగా పిలుచుకుంటారు. అక్టోబర్ 2021లో, సమంత, నాగ చైతన్యలు ఓ సంయుక్త ప్రకటనలో తాము విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Read More : నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా తెరకెక్కిన ‘థాంక్యూ’ సినిమా కలెక్షన్లు మరీ అంత తక్కువా? 

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!