Naga Chaitanya : నాగచైతన్య ఆ హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నారా ? నెట్టింట్లో వైరల్ అవుతున్న కొత్త వార్త !
Naga Chaitanya: నాగచైతన్య.. అక్కినేని కుటుంబ వారసుడిగా సుపరిచితుడు. 2021 లో సమంతలో విడాకులు తీసుకున్నాక.. నాగచైతన్య మళ్లీ తనదైన శైలిలో బ్యాచిలర్ లైఫ్‌ని గడపడానికి సిద్ధపడ్డాడు. అక్టోబర్ 2021 లో సమంత, నాగచైతన్యలు డైవోర్స్ తీసుకున్నాక, చాలా వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
అయితే, ఇప్పుడు తాజాగా ఓ వార్త ఫిల్మ్ నగర్ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'మేజర్', 'మేడ్ ఇన్ హెవెన్' లాంటి చిత్రాలతో పాపులర్ అయిన శోభితా ధూళిపాళ్ళతో (Sobhita Dhulipala) చైతూ డేటింగ్ చేస్తున్నారని ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి కారణం ఏమిటంటే, ఇటీవలే వీరిద్దరూ జూబ్లిహిల్స్‌లోని చైతూ ఇంటికి కలిసి వెళ్తుండడం కొందరు మీడియా వాళ్లు చూశారట.
శోభిత, చైతూ (Naga Chaitanya).. ఇద్దరూ ఒకే కారులో జూబ్లిహిల్స్‌లోని ఇంటికి రావడం, అక్కడ కొద్ది సేపు గడపడం, ఆ తర్వాత తిరిగి వెళ్లిపోవడం .. ఇవన్నీ కొందరు గమనించారట. అలాగే 'మేజర్' షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా, శోభితను కలవడానికి నాగచైతన్య పలుమార్లు, ఆమె బస చేసిన హోటల్‌కి వెళ్లారట.
దీనిని బట్టి చైతూ, శోభితల మధ్య కొత్త స్నేహం చిగురిస్తోందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అది ఇది కేవలం స్నేహ బంధమా? లేక ప్రేమ బంధమా ? అన్నది కాలమే నిర్ణయించాలి.
ఏ మాయ చేశావే, మజిలీ లాంటి సినిమాలలో నాగచైతన్య (Naga Chaitanya), సమంతలు కలిసి నటించారు. అక్టోబర్ 2021 నెలలో తమ 4వ వివాహ వార్షికోత్సవానికి ముందే, వీరిరువురూ విడాకులు తీసుకున్నారు. ఇదే క్రమంలో ఒక జాయింట్ స్టేట్‌మెంట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొన్ని కారణాల వల్ల తాము విడాకులు తీసుకుంటున్నామని, కానీ తమ మైత్రి కొనసాగుతుందని వారు ఆ స్టేట్ మెంట్‌లో తెలిపారు. ప్రస్తుతం నాగచైతన్య (Naga Chaitanya) 'థాంక్యూ' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అలాగే సమంత కూడా తన ఇతర ప్రాజెక్టులతో ఖాళీ లేకుండా ఉన్నారు.