నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా తెరకెక్కిన ‘థాంక్యూ’ సినిమా కలెక్షన్లు మరీ అంత తక్కువా? ఆదివారం కూడా అంతంతే

Updated on Jul 25, 2022 07:24 PM IST
నాగచైతన్య  (Naga Chaitanya) హీరోగా తెరకెక్కిన థాంక్యూ సినిమా  పోస్టర్
నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా తెరకెక్కిన థాంక్యూ సినిమా పోస్టర్

అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా థాంక్యూ. 'మనం' తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా కావడంతో భారీ అంచనాల మధ్య 'థాంక్యూ' సినిమా రిలీజైంది. 'శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్' బ్యానర్‌‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు.

రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. జూలై 22న విడుదలైన థాంక్యూ సినిమాకు మార్నింగ్ షోతోనే నెగెటివ్‌ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.  

లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాల విజయంతో మంచి జోష్‌తో థాంక్యూ సినిమా చేశారు నాగచైతన్య. అయితే ఆ రెండు సినిమాల కలెక్షన్లను ఈ సినిమా రాబట్టలేకపోయిందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

నాగచైతన్య  (Naga Chaitanya) హీరోగా తెరకెక్కిన థాంక్యూ సినిమా  పోస్టర్

ఇదే ఫస్ట్‌ టైమ్..

మొత్తం రూ.23.85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది థాంక్యూ సినిమా. అయితే సినిమా రిలీజైన మూడు రోజుల్లో కేవలం రూ.3.86 కోట్ల షేర్‌‌ మాత్రమే రాబట్టింది ఈ సినిమా. ఈ మధ్యకాలంలో నాగచైతన్య సినిమాలకు ఇంత దారుణమైన ఓపెనింగ్స్ రావడం ఇదే మొదటిసారి.

ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రూ.19.99 కోట్ల షేర్ రాబట్టాలి. సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడో రోజు కూడా కోలుకోలేని దెబ్బ పడిందనే అంటున్నారు మేకర్స్. ఇక, సినిమా కలెక్షన్ల పరంగా కనీసం రూ.10 కోట్ల షేర్‌‌ అయినా నాగచైతన్య (Naga Chaitanya) ‘థాంక్యూ’ సినిమా రాబడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read More : రవితేజకు (Ravi Teja) చిరంజీవి స్ఫూర్తి నాకు రవితేజ స్ఫూర్తి: ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రీ రిలీజ్​లో నాని (Nani)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!